దగ్గుబాటి రానా, సాయి పల్లవి, ప్రియమణి ముఖ్య పాత్రలో వస్తున్న సినిమా విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మూడేళ్ల తర్వాత.. ఎట్టకేలకు విముక్తి లభించింది. జులై 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు విరాట పర్వం మూవీ యూనిట్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
విడుదల తేదీని ప్రకటించిన విరాట పర్వం టీం.. ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో పడింది. అందులో భాగంగా.. సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా వెన్నెల సోల్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసింది. అడవిలో పుట్టిన వెన్నెల.. కామ్రేడ్ రవన్నతో ప్రేమలో పడటం గురించి చూపించారు.
అలాగే.. “నిర్భంధాలను కౌగిలించుకుని వసంత కాలం మనది. రేపు మనం ఉన్న లేకున్నా.. మన ప్రేమ ఉంటుంది. మన ప్రేమ కథను వినిపిస్తుంది “ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోతో విరాట పర్వంలో వెన్నెల పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో కూడా తెలుస్తుంది.