Anupama Parameswaran : టిల్లు హిట్ తో అను ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా?

Anupama Parameswaran : సౌత్ ఇండస్ట్రీలోని వెర్సటైల్ హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా పోషించగలదు. ఇప్పటిదాకా గాల్ నెక్స్ట్ డోర్ పాత్రలతో మెప్పించిన అనుపమ ఒక్కసారిగా టిల్లు స్క్వేర్ మూవీతో రూట్ మార్చింది. హఠాత్తుగా గ్లామర్ డోస్ ను పెంచేసి తన అభిమానులకు కిక్ ఇచ్చే సరికొత్త పాత్రలో మెరిసింది. టిల్లుతో సెక్సీగా, గ్లామరస్ గా సిల్వర్ స్క్రీన్ పై స్క్రీన్ షేర్ చేసుకుని తను కూడా సెక్సీ రోల్స్ కు సూట్ అవుతానని నిరూపించుకుంది. నిజానికి టిల్లు స్క్వేర్ మూవీకి ఈ రేంజ్ లో హైప్ వచ్చిందే అనుపమ వల్ల. టిల్లుతో హాట్ పోజ్ ఇచ్చిన ఒకే ఒక్క పోస్టర్ తో ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మూవీ కూడా 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

అయితే ఇప్పటిదాకా అనుపమ కెరీర్ లో హిట్లు లేవా? అంటే ఉన్నాయి. కానీ ఆ హిట్ తర్వాత కచ్చితంగా ఆమె ఖాతాలో ప్లాప్ పడుతూ వచ్చింది. దీంతో ఈసారైనా అనుపమ టిల్లుతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. నిజానికి అనుపమ టాలెంట్ ఉన్న హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు ఇప్పటిదాకా సరైన హిట్ పడలేదు. అడపాదడపా హిట్ లు కొడుతున్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అనుపమ ఫెయిల్ అవుతూనే ఉంది. ఒక పెద్ద హిట్ తర్వాత సరైన కథలను ఎంచుకుని ఆ జోష్ ను అలాగే కంటిన్యూ చేయడంలో ఈ బ్యూటీ చాలా కష్టపడుతోంది. దీంతో ఒక మూవీతో హిట్ కొట్టాక నెక్స్ట్ మూవీతోనే ఈ అమ్మడికి ఎదురు దెబ్బ తగులుతుంది.

శతమానం భవతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ అవార్డు విన్నింగ్ మూవీ తర్వాత అనుపమ కృష్ణార్జున యుద్ధం వంటి ప్లాప్ సినిమాలు చేసింది. 2022లో కార్తికేయ లాంటి మరో హిట్ మూవీలో కనిపించింది అనుపమ. దేశవ్యాప్తంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. కానీ ఆ వెంటనే 18 పేజెస్, సైరన్, ఈగల్ అంటూ వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్ లను తన ఖాతాలో వేసుకుంది అనుపమ. ఇప్పుడు మరోసారి తెలుగులో టిల్లు స్క్వేర్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది ఈ బ్యూటీ. లిల్లీ పాత్రలో అనుపమ కనిపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు.

- Advertisement -

డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ లో లిల్లీ పాత్రతో పాత రాధికను మరిపించాలని అనుకుంది. అయితే రాధిక పాత్రకు తగినట్టుగా లిల్లీ లేదనే టాక్ నడిచింది. రాధికను మరిపించడం లిల్లీకి సాధ్యం కానప్పటికీ అనుపమ తన మెచ్చుకోదగిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఈసారైనా టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ ను ఈ బ్యూటీ ఉపయోగించుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరోయిన్ కావడానికి ఈ అమ్మడు టిల్లు స్క్వేర్ ను మెట్టుగా ఉపయోగించుకొని, సరైన కథలను ఎంచుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి అనుపమ ( Anupama Parameswaran  ) తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు