Nani Remuneration : దానయ్యతో మాస్టర్ ప్లాన్… రెమ్యూనరేషన్ డబుల్ చేసిన నాని

Nani Remuneration : నేచురల్ స్టార్ నాని స్లోగా సినిమాలు చేస్తూ నెమ్మదిగా ఒక్కో మెట్టు పైకెక్కుతున్నాడు. అలాగే ఆయన పారితోషకం కూడా ఒక్కో సినిమాతో పెరుగుతూ వస్తోంది. తాజాగా నిర్మాత డివివి దానయ్య కారణంగా నాని రెమ్యూనరేషన్ అమంతంగా డబుల్ అయిపోవడం విశేషం.

నాని రెమ్యూనరేషన్ డబుల్ చేసిన దానయ్య

నేషనల్ స్టార్ నాని, ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్య కాంబినేషన్ లో ప్రస్తుతం సరిపోదా శనివారం అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయకగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్ట్ లో సరిపోదా శనివారం రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో పాటు డివివి దానయ్యతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో నాని హీరోగా డివివి దానయ్య మరో మూవీని కూడా నిర్మించబోతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ 2024 చివర్లో మొదలు కాబోతోందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే డివివి దానయ్య నానికి భారీ రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేశారని తెలుస్తోంది. అందుకే నాని ఇప్పటికే చేయాల్సిన కొన్ని ప్రాజెక్టులను పక్కన పెట్టి మరీ దానయ్య ప్రాజెక్టును పట్టా లెక్కించడానికి రెడీ అవుతున్నాడని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. దానయ్యతో చేస్తున్న కొత్త సినిమాకు నాని 50 కోట్లు కోట్ చేయగా, దానయ్య ఆయన డిమాండ్ కు ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో నాని లైనప్ లో పలు మార్పులు చోటు చేసుకోగా, దానయ్య ప్రాజెక్ట్ ముందు కార్యరూపం దాల్చబోతోంది. ఈ ఏడాదే షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు.

ఇంతకు ముందు నాని రెమ్యూనరేషన్ ఎంతంటే?

నాని తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టి దాదాపు 16 ఏళ్లు పూర్తయిపోయింది. నేచురల్ స్టార్ గా తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. అలాగే కథల మీద మంచి పట్టు ఉంది ఈ హీరోకు. అందుకే నానితో సినిమా అంటే మినిమం గ్యారంటీ హిట్ అని నమ్ముతారు నిర్మాతలు. గత ఏడాది నాని దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాని ( Nani Remuneration ) తనను 100 కోట్ల క్లబ్ లో చేర్చిన దసరా మూవీకి 22 కోట్లు, హాయ్ నాన్న మూవీకి 25 కోట్లు, ప్రస్తుతం చేస్తున్న సరిపోదా శనివారం మూవీకి 25 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న నాని దానయ్యతో ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే బలగం వేణు దర్శకత్వంలో మూవీ, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ ప్లాన్ చేశాడు నాని. ఆ రెండు సినిమాలకు ఈ హీరో పారితోషకం మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు