Producer Dil Raju : పెళ్లిపై ట్రోలింగ్… దిల్ రాజు ఎపిక్ రియాక్షన్

Producer Dil Raju : ఈ సోషల్ మీడియా యుగంలో సినీ తారలపై ట్రోలింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. స్టార్స్ గురించి ఏ విషయం బయటకు వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. వాళ్ల సినిమాల గురించి మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా త్వరగా తెలుసుకుంటున్నారు అభిమానులు. దీనివల్ల అభిమానులకు, సెలబ్రిటీలకు మధ్య బాగా దూరం తగ్గిపోయింది. కానీ ఇదే సోషల్ మీడియా కారణంగా చాలామంది సెలబ్రిటీలు ఇబ్బందుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ట్రోలింగ్ అనేది సెలబ్రిటీలకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. స్టార్స్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్… ఇలా ఏ విషయం బయటకు వచ్చినా ఒక వర్గం ట్రోల్ చేస్తూనే ఉంటారు. కొంతమంది ప్రముఖులు వీటిని చూసి చూడనట్టుగా ఉంటే, మరి కొంతమంది మాత్రం గట్టిగా సమాధానం చెప్తారు. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గతంలో పెళ్లి గురించి ఆయనపై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించారు. ట్రోల్స్ కు ఆయన ఇచ్చిన ఎపిక్ రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది.

ట్రోలింగ్స్ ఏమన్నా చంపేస్తాయా? దిల్ రాజు ఎపిక్ రియాక్షన్

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజాగా ఆయన నిర్మించిన ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనపై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించారు. దిల్ రాజు మాట్లాడుతూ తన పెళ్లి తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్యను ఎలా కలిశాను అనే వివరాలను వెల్లడించానని, ఆ వీడియో పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిందని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ ట్రోలింగ్ గురించి తన భార్య తనకు చెప్పిందని, కానీ తాను మాత్రం అలాంటి విషయాలను అస్సలు పట్టించుకోనని చెప్పుకొచ్చారు దిల్ రాజు. తనను తెలుగు రాష్ట్రాల్లో గుర్తు పట్టే వాళ్ళు కోటి మంది ఉంటే, కామెంట్ చేసే వాళ్ళు కేవలం 10000 మంది మాత్రమే ఉంటారని అన్నారు. ఇలా ట్రోలింగ్ చేసే వారిని పట్టించుకుంటే మిగతా వాళ్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంటుందని, అందుకే తాను ట్రోలింగ్ గురించి అస్సలు ఆలోచించనని చెప్పుకొచ్చారు. నెగిటివిటీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలని సలహా ఇచ్చిన దిల్ రాజు అవన్నీ వచ్చిపోయే మేఘాల లాంటివని, తాను మాత్రం ఆకాశం లాంటి వాడినని అన్నారు. ట్రోలింగ్స్ ఏమన్నా చంపేస్తాయా… కాదు కదా… అలాంటి మేఘాలన్నీ వెళ్ళిపోయాక మనకు ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది అని చక్కని ఉదాహరణతో ట్రోలింగ్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. మొత్తానికి ఆయన రియాక్షన్ కు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.

ఫ్యామిలీ స్టార్ తో ప్రయత్నం…

దిల్ రాజు ( Producer Dil Raju  ) నిర్మించిన ఫ్యామిలీ స్టార్ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. డైరెక్టర్ పరశురాం ఈ మూవీని పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఈ మూవీకి నెగెటివ్ టాక్ నడుస్తోంది. ఫ్యామిలీ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు