Alia Bhatt: ఎంత అలసిపోయినా రాత్రిళ్ళు అది చేయాల్సిందే – అలియా భట్..!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి అడుగుపెట్టినప్పటికీ కూడా సొంతంగా ప్రయత్నాలు చేస్తూ అందరిలాగే ఆడిషన్స్ కి వెళ్తూ నెపోటిజం అన్న పదానికి దూరంగా ఉంటూ తానేంటో నిరూపించుకున్న ఏకైక బ్యూటీ ఈ ముద్దుగుమ్మ.. ఒకవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు సొంతం చేసుకోవడమే కాదు… బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ జాబితాలో కూడా చేరిపోయింది ఆలియా భట్. ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో తనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె స్వయంగా వెల్లడించిన తన వ్యక్తిగత , కెరియర్ విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతూ ఉండడం గమనార్హం..

ఎంత కష్టమైనా అది చేయాల్సిందే…
అలియా భట్ కి మొదటి నుంచి డైరీ రాయడం అలవాటు. ఎంత ఆలస్యం అయినా సరే.. అలసటగా ఉన్నా సరే డైరీ రాసుకున్నాకే నిద్రపోతుందట. అసలే ఒకవైపు వరుస సినిమా షూటింగ్ లతో సతమతమయ్యే అలియా భట్.. మరికొన్ని ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. అంతేకాదు సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తున్న ఈమె మరొకవైపు తల్లిగా, భార్యగా, కోడలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇన్ని బాధ్యతల మధ్య ప్రతి రోజూ.. రోజులో ఏం జరిగింది అన్న విషయాన్ని చక్కగా డైరీలో పొందుపరచడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. అలియా భట్ కి ఇంత మంచి అలవాటు ఉందా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..

అలియా భట్ సినీ కెరియర్…
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇందులో సీత పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే బ్రహ్మస్త్రం సినిమాతో కూడా మెప్పించిన ఈమె.. గత ఏడాది రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాతో సందడి చేసింది. అంతేకాదు హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాతో హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన అలియా.. ప్రస్తుతం జిగ్రా అనే సినిమాతో బిజీగా ఉంది. ప్రస్తుతం సంజయ్ లీల తెరకెక్కించనున్న ఒక మల్టీ స్టారర్ సినిమాలో యష్ రాజ్ ఫిలిం స్పై యూనివర్స్ లో రూపొందుతున్న చిత్రంలో ఈమె నటిస్తూ ఉండడం గమనార్హం..

- Advertisement -

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా…
అలియా భట్ వ్యాపారవేత్తగా, నటిగా, బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేస్తోంది. తాజాగా ఈమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన పోచర్ వెబ్ సిరీస్ కూడా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి ఆదరణ పొందింది..

అలియా భట్ వైవాహిక జీవితం…
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. ఒక కూతురికి జన్మనిచ్చింది.. పాప పేరు రాహా.. వివాహానికి ముందే గర్భం దాల్చిన అలియా భట్ వివాహమైన ఆరు నెలలకే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది..

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు