HBD Alia Bhatt: అలియా భట్ ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరో తెలుసా..?

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ భట్.. ప్రముఖ నటి సోనీ రజ్దాన్ కుమార్తె అలియా భట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐదేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్ గా మారింది.. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా తనకు ఇష్టమైన ఫుడ్ , ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరో ఇప్పుడు చూద్దాం..

సొంత టాలెంట్ తో..
సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ.. తల్లిదండ్రుల పేర్లు వాడుకోకుండా స్వతహాగా సినిమాలో రాణించాలనుకుంది. అందుకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగింది.. ఎట్టకేలకి కరణ్ జోహార్ 2012లో తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది.. ఏకంగా 400 మందితో ఆడిషన్స్ లో పోటీపడి అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ .. స్టూడెంట్ పాత్రలో ఒదిగిపోయేందుకు మూడు నెలల్లో ఏకంగా 16 కిలోల బరువు తగ్గి తొలి ప్రయత్నం లోనే ప్రేక్షకులను మెప్పించి.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.. అలా హైవే,2 స్టేట్స్ , కపూర్ అండ్ సన్స్ వంటి చిత్రాలలో అవకాశాలు సొంతం చేసుకొని సక్సెస్ అందుకుంది..

నెపోటిజం పై స్పందన..
ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా భట్ నెపోటిజంపై మాట్లాడింది.. నా కెరియర్ ప్రారంభంలో నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా సరే నెపోటిజం ప్రస్తావన వచ్చేది.. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే రాణించగలుగుతోంది అని చాలామంది అనేవారు.. ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా అలా ఎందుకు అంటున్నారో అర్థం అయ్యేది కాదు అంటూ తనపై వచ్చిన విమర్శలపై ఒక సందర్భంలో స్పందించింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ఇష్టమైన ఆహారం..
తనకు చిన్నప్పటి నుంచి చేపలు, రసగుల్లా, ఫ్రెంచ్ ఫ్రైస్, పెసరపప్పు హల్వా, పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం అని .. ఇవి లేకుండా తన భోజనం సంపూర్ణం కాదు అని వెల్లడించింది. అంతేకాదు ఒకవేళ ఏవి ఉన్నా లేకపోయినా భోజనంలో మాత్రం కచ్చితంగా పెరుగు ఉండాల్సిందే అని ఆమె వెల్లడించింది. ఎక్కడికి వెళ్లినా.. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా భోజనం సమయానికి కచ్చితంగా వస్తానని.. ఆ భోజనంలో పెరుగు ఉండేలా చూసుకుంటానని చెప్పుకొచ్చింది ఆలియా భట్..

ఆలియా భట్ కి ఇష్టమైన సెలబ్రిటీ..
హీరోయిన్లలో తనకు కరీనాకపూర్, కరిష్మా కపూర్ అంటే చాలా ఇష్టమని.. హీరోలలో షారుక్ ఖాన్ అని , ఇక తెలుగులో ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. బాహుబలి సినిమాలో ప్రభాస్ నటన తనకు ఎంతో నచ్చిందట.. అతడితో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న అని కూడా తెలిపింది ఆలియా భట్..

ఇష్టమైన జంతువు..
అలియా భట్ కి చిన్నప్పటి నుంచి పిల్లులు అంటే చాలా ఇష్టమే.. అందుకోసమే తాను ఒక పిల్లిని కూడా పెంచుకుంటున్నానని..తాను పెంచుకునే పిల్లి కి ఎడ్వర్డ్ అని నామకరణం కూడా చేశానని చెప్పుకొచ్చింది. ఇలా ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈమెకు సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు