Tantra Movie Review and Rating: తంత్ర మూవీ రివ్యూ

ఈ వారం కుప్పలుతెప్పలుగా వచ్చిన సినిమాల లిస్ట్ లో ‘తంత్ర’ కూడా ఒకటి. అనన్య నాగళ్ళ హీరోయిన్ కావడం, శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో.. ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది ఈ మూవీకి. శ్రీనివాస్ గోపిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీని నరేష్ బాబు పి, రవి చైతన్య కలిసి నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ చూశాక ఇది కూడా విరూపాక్ష, మంగళవారం టైపులో ఓ మంచి థ్రిల్లర్ అవుతుందని అంతా భావించారు. మరి సినిమా ఆ స్థాయిలో ఉందా? బ్లాక్ బస్టర్ కొట్టే సరుకు ఇందులో ఉందా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి…

కథ:
‘తంత్ర’ కథ మొత్తం హీరోయిన్ అనన్య నాగళ్ళ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రేఖ(అనన్యా నాగళ్ల) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతుంది. తండ్రి ఆమెను సరిగ్గా చూడడు. ఎప్పుడూ తిట్టి పోస్తుంటాడు. తేజా (ధనుష్ రఘుముద్రి) అనే కుర్రాడిని చిన్నప్పటి నుండి ప్రేమిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అతనికి కూడా రేఖ అంటే ఇష్టం. అయితే… రేఖకి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది. ఆమెకి ఎక్కువగా దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఆమె ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. దీంతో ఎవరో ఆమెపై క్షుద్రపూజలు చేశారు అని తేజకి అనుమానం వస్తుంది. తర్వాత అది నిజం అని తేలిపోతుంది. అసలు రేఖపై క్షుద్ర పూజలు చేసింది ఎవరు? ఆమెకు ఎందుకు కష్టాలు వచ్చాయి? చివరికి ఆమె సమస్యలని తేజ ఎలా తీర్చాడు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే జనాల్లో ఓ రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రతి ఒక్కరు గోడిగుడ్డు మీద ఈకలు వెతికినట్టు చూస్తారు. విలన్ ఎవరు, మంచోడే చివరికి విలన్ అవుతాడా? ఇలాంటి ప్రశ్నలతోనే ఇలాంటి సినిమాలు చూస్తారు ప్రేక్షకులు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా.. స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసుకోవాలి. ‘తంత్ర’ విషయంలో.. ఇది పూర్తి రివర్స్ అయ్యింది అని చెప్పాలి. ఎందుకంటే మొదటి సీన్ నుండి ఏమాత్రం ఆసక్తి లేకుండా సాగుతుంది ఈ సినిమా. డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంటుంది. మ్యూజిక్ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపే విధంగా ఉండదు. సినిమాటోగ్రఫీ కూడా కనీసం అట్రాక్టివ్ గా ఉండదు. ఇలాంటి చీప్ క్వాలిటీ విజువల్స్ ఓటీటీ సినిమాల్లో కూడా ఉండవు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. అనన్య నాగళ్ళ మంచి నటి. కానీ ఆమె వీక్ పెర్ఫార్మన్స్ లు ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఇది కచ్చితంగా టాప్ ప్లేస్ లో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ‘మంగళవారం’ లో పాయల్ ని చూసి తాను కూడా ఇలాంటి పాత్ర చేస్తే దశ తిరిగిపోతుంది అనుకుందో ఏమో కానీ.. ఆమె అంచనాలను తలక్రిందులు చేసే సినిమా ఇది. ఇక శ్రీహరి తమ్ముడు కొడుకు ధనుష్ రఘుముద్రి కూడా పెద్దగా ఇంప్రెస్ చేసే నటన కనపరిచింది లేదు. నటుడిగా అతను చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. సలోని చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా.. గతంతో పోలిస్తే పాత్రల ఎంపిక విషయంలో ఆమె ఏమాత్రం పరిణితి చెందలేదు అని స్పష్టమవుతుంది. ఆమె లుక్స్ కూడా బాలేదు. కుశాలిని కూడా నటనతో ఇంప్రెస్ చేసింది లేదు. ‘టెంపర్’ వంశీ మాత్రం పర్వాలేదు అనిపించాడు.లక్ష్మణ్ మీసాల కూడా ఒకే. మిగిలిన నటీనటులు పెద్దగా రిజిస్టర్ కారు. అలాంటి పాత్రలు వారివి.

ప్లస్ పాయింట్స్ :

రన్ టైం 2 గంటల 16 నిమిషాలు మాత్రమే ఉండటం

మైనస్ పాయింట్స్ :

మిగిలినవన్నీ

మొత్తంగా.. ‘తంత్ర’ ఏ దశలోనూ ఆకట్టుకోని హర్రర్ థ్రిల్లర్ మూవీ. లాజిక్ మిస్ అయినా, మ్యాజిక్ కూడా లేని నాసిరకం సినిమా ఇది. ఇలాంటి సినిమాని ఓటీటీలో కూడా చూడలేం.

రేటింగ్ : 1 /5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు