Ali Fazal : మొత్తానికి ఫిక్స్

యాక్ట‌ర్ అలీ ఫ‌జ‌ల్ అంటే చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. మిర్జాపూర్ గుడ్డు భ‌య్యా అంటే అంద‌రికీ గుర్తుంటుంది. అమెజాన్‌ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన మిర్జాపూర్ వెబ్‌సిరీస్ ద్వారా ఫేమ‌స్ అయ్యాడు అలీ ఫ‌జ‌ల్‌. రెండు సీజ‌న్లలో కూడా గుడ్డు భ‌య్యాగా బాగా అల‌రించారు. ఇక త్వ‌ర‌లోనే ఈ న‌టుడు పెళ్లి పీట‌లెక్క‌నున్నాడు. బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దాను అక్టోబ‌ర్ 04న పెళ్లి చేసుకోబోతున్నాడు.

దాదాపు తొమ్మిది సంవ‌త్స‌రాల‌కి పైగా డేటింగ్ చేసిన ఈ జంట పెళ్ళి బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. వీరి పెళ్లి మొద‌ట అక్టోబ‌ర్ 06న ప్ర‌చారం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ ఆ తేదీ మారింది. తాజాగా అక్టోబ‌ర్ 04న పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు అలీ-రీచా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఫ‌క్రే మూవీలో క‌లిసి న‌టించిన ఈ జంట ఆ స‌మ‌యంలోనే ఒక‌రికొక‌రు ఇష్ట‌ప‌డ్డారు.

2020 నుంచి పెళ్లి చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, కానీ అది కుద‌ర‌డం లేద‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో రిచా చెప్పింది. క‌రోనా కార‌ణంగా మా పెళ్లి వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. లేదంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని ఇద్ద‌రం సెటిల్ అయ్యేవాళ్ల‌మ‌ని చెప్పుకొచ్చింది. ఇక ఆ ఇంట‌ర్వ్యూలో 2022లో క‌చ్చితంగా పెళ్లి చేసుకుంటాం అని వెల్ల‌డించింది. ఆమె చెప్పిన‌ట్టుగానే అక్టోబ‌ర్‌లో వివాహం చేసుకోనుంది ఈ జంట‌. ఫెమినా మ్యాగ‌జైన్ కోసం ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేశారు. వీరి పెళ్లి వేడుక అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగ‌నుంద‌ట‌. ప‌లువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజ‌రవుతార‌ని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు