Akkineni: అమల నగలు ఎందుకు వేసుకోదు ?

అక్కినేని  అమల గురించి టాలీవుడ్ లో తెలియని వారు ఉండరు. 1987లో నాగార్జున హీరోగా వచ్చిన కిరాయి దాదా సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన అమల ఆ తర్వాత మళ్లీ నాగార్జున తోనే కలిసి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమె సినిమా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రెండు సంవత్సరాలు సూపర్ హిట్ సినిమాలు చేసి, 1992లో హీరో అక్కినేని నాగేశ్వరరావు వారసుడు నాగార్జునను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.

ప్రస్తుతం అక్కినేని కోడలు అమల, తన కుటుంబాన్ని చూసుకుంటూ, అక్కినేని కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ వస్తుంది. కాగా, ఈమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే అమలకు కొన్ని కోట్ల ఆస్తి ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆమె మాత్రం సింపుల్ గా ఒక నల్లపూస దండతో మాత్రమే కనిపిస్తుంది. అయితే అమలకు అదోరకమైన స్కిన్ ఎలర్జీ, ఆరోగ్య సమస్య ఉంది.

అందుకే ఆమె బంగారం, నగలు ధరించదు అంటున్నారు కొందరు. అంతేకాకుండా బంగారు నగలు ధరిస్తే మెడపై, చేతులపై రాషెస్ ఏర్పడి చర్మం మొత్తం ఎర్రబడిపోయి గోరంగా కనిపిస్తుందట. అందువల్లనే పాపం అమల బంగారు నగలకు దూరంగా ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు