Nani: దసరా హీరోకి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన గంట నవీన్ బాబు.. ఒక్కొ మెట్టు ఎక్కుతూ నాచురల్ స్టార్ నాని వరకు ఎదిగాడు. నాని ఇప్పటి వరకు చేసిన 28 సినిమాలకు భిన్నంగా, తాజాగా రాబోతున్న దసరా సినిమాలో కనిపించబోతున్నాడు. తెలంగాణలోని గోదవరి ఖని బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది.

సినిమాతో నాని చాలా మంది ఫేవరెట్ హీరో అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన నటన ఏ స్థాయిలో ఉందో, ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్ తో తెలిసిపోయింది. విడుదల తర్వాత నాని రికార్డ్ లు బ్రేక్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ నేచురల్ స్టార్ కి ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అలాంటి నానికి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా ? దసరా ప్రమోషన్స్ సమయంలో ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పేశాడు నాని.

అతిలోక సుందరి దివంగత నటి శ్రీ దేవి అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు నాని. శ్రీ దేవి నటనకు తాను వీరాభిమానిని అని చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం నుంచి శ్రీ దేవిపై ఇష్టం ఇంకా పెరిగిపోయిందని వెల్లడించాడు. అంతే కాదు, తన జీవితంపై శ్రీ దేవి ప్రభావం కూడా ఉందని తెలిపాడు. తాను పెరుగుతున్న కొద్ది శ్రీదేవికి అభిమానిగా మారిపోతున్నాని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు