Meter Trailer : మళ్ళీ అదే రొటీన్..

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా నటించిన చిత్రం మీటర్. ఈ సినిమా యొక్క అఫీషియల్ ట్రైలర్ ఈ రోజు అనగా మార్చి 29 ఉదయం 11. 07 గంటలకు AMB సినిమాస్ లో మైత్రి మూవీ మేకర్స్ టీం విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తో యావరేజ్ హిట్ అందుకున్న కిరణ్, ఇప్పుడు మీటర్ సినిమా తో ముందుకు వస్తున్నాడు. ఇంత వరకు ముందు వచ్చిన సినిమాల కన్నా రఫ్ గా, మరింత ఎనర్జిటిక్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఒక పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడని ట్రైలర్ చూడగానే తెలిసి పోయింది.

అయితే ఇంతకు ముందే కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ అనే సినిమా లోను పోలీస్ గా కనిపించడం జరిగింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. ఇప్పుడు మరోసారి మీటర్ సినిమాలో పోలీస్ గా కనిపిస్తున్నాడు. అతుల్య రవి హీరోయిన్ గా నటించింది.  ట్రైలర్ మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ వీడియో లో డైలాగ్స్ కూడా బాగున్నాయి. కానీ ట్రైలర్ చూస్తున్నంత సేపు మనం చాలా సినిమాల్లో చుసిన కథే అని మనకు అనిపిస్తుంది. కొన్ని సీన్లలో మనకు రవితేజ సినిమాల్లోని సన్నివేశాలు గుర్తుకొస్తాయి. సినిమాలో పేరున్న నటులను ఎక్కువగా తీసుకోలేదు అని తెలుస్తుంది. సప్తగిరి, పోసాని కృష్ణమురళి మాత్రమే మనకు తెలిసిన యాక్టర్స్ .

 

- Advertisement -

సాయి కార్తీక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. రమేష్ కదురి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చెర్రీ,హేమలత నిర్మిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. అయితే అదే రోజు విడుదల అవుతున్న రావణాసుర సినిమాను ఈ మూవీ తట్టుకొని నిలబడగలదా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు