S.S.Karthikeya: ఇంతవరకు రాజమౌళిని డాడీ అని పిలవని కొడుకు!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 100 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా స్థాయి ఉన్నత శిఖరాలకు తాకింది. సినిమా రంగంలోనే అత్యున్నత పురస్కారం కావడంతో యావత్ దేశం ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గర్వపడుతోంది. మొదటి నుండి ఆర్ఆర్ఆర్ కు ఏదో ఒక విభాగంలో ఆస్కార్ పక్కా అని విశ్లేషకులు అంచనా వేశారు.

భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీలో ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కకపోవడంతో, సొంతంగా ఆస్కార్ ఎంట్రీకి వెళ్లారు. ఆస్కార్ నామినేషన్ కి అప్లై చేసే ప్రాసెస్ నుండి ఆర్ఆర్ఆర్ మూవీ క్యాంపైన్ బాధ్యతలు కార్తికేయ చూసుకున్నాడు. అందుకే ఆస్కార్ వేదికపై కీరవాణి కార్తికేయకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. ఆస్కార్ ఇండియన్ సినిమాకు దక్కడంలో కార్తికేయ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. తన తండ్రి రాజమౌళి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

రాజమౌళిని ఇప్పటి వరకు నాన్న అని పిలవలేదట. మొదటి నుండి బాబా అని పిలవడం అలవాటట. అలానే పిలుస్తానని కార్తికేయ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా రాజమౌళికి కార్తికేయ సొంత కొడుకు కాదన్న సంగతి తెలిసిందే. రాజమౌళి భార్య రమా మొదటి భర్త సంతానమే కార్తికేయ. రమా, రాజమౌళికి ఒక కూతురు ఉంది. రాజమౌళికి కార్తికేయ స్టెప్ సన్ అయినా, ఎప్పుడూ అలా ఉండరు. సొంత తండ్రీ కొడుకులే అన్నట్టు ఉంటారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు