Bhumika: ఆ హీరోతో 20 ఏళ్ల తర్వాత..

వెండితెరపై కొంతమంది హీరో – హీరోయిన్ల జంటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అలా ఓ హిట్టు పడితే ఆ కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుంటుందని ప్రేక్షకులలో ఓ ఫీల్ కలుగుతుంది. అలా టాలీవుడ్ లో జనాలను బాగా ఆకట్టుకున్న జంటలలో విక్టరీ వెంకటేష్ – భూమిక చావ్లా జంట ఒకటి. వీరిద్దరూ కలిసి చేసింది ఒక్క సినిమానే అయినా.. వీరి జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో వెంకీ మామ – భూమిక జంట వాసు సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రంలో వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుంటుందని అంతా భావించారు. కానీ మరోసారి మీరు జంటగా నటించే అవకాశం రాలేదు. తాజాగా వీరి కాంబినేషన్ గురించి ఓ సర్ప్రైజ్ బయటికి వచ్చింది. 20 ఏళ్ల తర్వాత వెంకటేష్ – భూమిక జంటగా ప్రేక్షకులను కనివిందు చేయనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “కిసికా భాయ్ కీసి కి జాన్”.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూండగా.. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ఓ పాటలో సర్ప్రైజ్ రివిల్ చేసింది మూవీ యూనిట్. ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్ భూమిక కనిపించనుంది. ఈ పాటలో ఈ సూపర్ హిట్ జంట ఎంతో అందంగా నవ్వులు చిందిస్తూ ప్రత్యక్షమయ్యారు.

- Advertisement -

చాలాకాలం తర్వాత వెంకీ అండ్ భూమిక జోడిగా కనిపించబోతుండడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం వీరు జంటగా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు