Priyanka Chopra: టైం లేదని.. వాటికి గుడ్ బై ?

ప్రియాంక చోప్రా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు గ్లోబల్ ముద్దుగుమ్మ. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక చోప్రా తన అందచందాలతో మెప్పించింది. బాలీవుడ్ లో గుర్తింపు పొందిన తర్వాత అమ్మడు మకాం హాలీవుడ్ కు మార్చింది. అక్కడ వెబ్ సిరీస్ లో సినిమాలు చేస్తూ పాపులర్ అయింది. అయితే కెరీర్ ప్రారంభం నుంచి సింగర్ గా ప్రయత్నాలు చేసింది ప్రియాంక చోప్రా.

ఈ నేపథ్యంలోనే పాటలు రాసి, ఆలపించి ‘ఇన్ మై సిటీ’, ‘ఎగ్జాటిక్’ అనే రెండు సోలో ఆల్బమ్స్ రిలీజ్ చేసింది. అయితే, తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. నటిగా తీరిక లేనందువల్ల తన సంగీత ప్రయాణం ముందుకు సాగడం లేదని ఆమె చెబుతున్నది. సంగీతంలో తాను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని, ఆ సాధన, అభ్యాసం చేయకుండా ఇకపై ఆల్బమ్స్ రూపొందించకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రియాంక చోప్రా వెల్లడించింది.

హీరోయిన్ గా తను తీరిక లేకుండా ఉండటం ఇందుకు మరో కారణం అంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ, ‘మనకు ఇష్టమైన కొన్ని పనుల మీద సమయం వెచ్చిస్తుంటాం. వాటి మీద ఆసక్తి ఉన్న, కొన్నిసార్లు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. సంగీతంలో నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకున్నది సరిపోకే నా ఆల్బమ్స్ ఆశించిన స్పందన తీసుకురాలేకపోయాయి. నటిగా నా సినిమాల మీద దృష్టి సారించాల్సిన ఒత్తిడి ఉంది. అందుకే మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి కొంత విరామం తీసుకుంటున్నా’ అని చెప్పింది. కాగా ప్రస్తుతం ప్రియాంక హిందీలో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తో పాటు ‘జీలే జరా’ అనే మరో చిత్రంలో నటిస్తున్నది.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు