Srikanth Addala: మరో “అల్లుడు శీను”

సినిమా రంగంలో వారసత్వానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సినిమా రంగంలో వారసత్వం అనేది ఆయా హీరోలు చేసే సినిమాలకి కేవలం మొదటి రోజు ఓపెనింగ్స్ తీసుకురావడానికి మాత్రమే ప్లస్ అవుతాయి. ఆ తరువాత సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేదంటే సింపుల్ గా లైట్ తీసుకుంటారు.

ఇప్పటివరకు చాలామంది వారసులు సినిమా ఇండస్ట్రీలో రాణించారు. ఇంకొంతమంది ఇంకా కెరియర్ లో నిలబడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే “అఖండ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి, తన భార్య సోదరుడిని హీరోగా పరిచయం చేసేందుకు సిద్దమవుతున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.

ఇక ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం చేయబోతున్నట్లు తెలుస్తోంది. “కొత్త బంగారు లోకం” సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాతో మరోమారు మల్టీస్టారర్ సినిమాలకు తెర తీసాడు. బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిజిస్టార్ ను మూట కట్టుకున్న శ్రీకాంత్ అడ్డాల, నారప్ప సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.

- Advertisement -

ఇప్పుడు ఈ సినిమాతో ఈ కొత్తవారసుడికి ఏ స్థాయి హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే. కొత్తవాళ్లతో చెయ్యడం శ్రీకాంత్ అడ్డాలకి కూడా కొత్త కాదు, ఇదివరకే ముకుంద సినిమాతో వరుణ్ తేజ్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు శ్రీకాంత్. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల చేయబోయే సినిమా కూడా భారీస్థాయిలో ఉండబోతుందట. దాదాపుగా 40 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన “అల్లుడు శీను” చిత్రానికి ఇదే స్థాయిలో ఖర్చుపెట్టారు. ఇప్పుడు ఒక డెబ్యూ హీరోకి ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం కూడా అరుదైన విషయం. ఇకపోతే ఈ సినిమా ద్వారక క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుందా? లేక మరేదైనా నిర్మాణ సంస్థలో నిర్మిస్తారా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు