Arjun Sarja : యాక్షన్ కింగ్ ఇంట్లో విషాదం

యాక్షన్ కథలతో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అర్జున్. తన మార్క్ సినిమాలతో యాక్షన్ కింగ్ పేరు సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకండా ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలను కూడా చేస్తున్నాడు అర్జున్. దీంతో పాటు దర్శకుడు, రచయిత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా కూడా అర్జున్ కనిపించాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి దర్శకత్వం వహించడమే కాకండా, నిర్మాణ బాధ్యతలు కూడా చూస్తున్నారు.

అంతా సక్రమంగా ఉన్న యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో ఈ రోజు విషాదం చోటు చేసుకుంది. అర్జున్ తల్లి లక్ష్మీ దేవమ్మ (85) ఈ రోజు చనిపోయింది. గత కొద్ద రోజుల నుండి ఆనారోగ్యంగా ఉన్న లక్ష్మీ దేవమ్మ బెంగళూరు లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ రోజు పరిస్థితి విషమించడంతో చనిపోయింది. ఈ విషాద ఘటనతో అర్జున్ ఇంట దిగ్బ్రాంతి నెలకొంది. ఇదిలా ఉండగా, లక్ష్మీ దేవమ్మ మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు