Mental Health : ఒంటరిగా టైం స్పెండ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

మనం ప్రస్తుతం కొనసాగిస్తున్న లైఫ్ స్టైల్ కారణంగా ఫిజికల్ హెల్త్ మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్ కూడా బాగా ప్రభావితం అవుతుంది. ఆఫీస్ పని, వ్యక్తిగత జీవితంలో సమస్యలు, సోషల్ మీడియా వంటి అనేక కారణాల వల్ల మనలో ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. దీంతో ఆ ఎఫెక్ట్ మన మానసిక ఆరోగ్యంపై పడుతుంది. అయితే ఇలా పెరిగే స్ట్రెస్ ను తగ్గించడానికి మనం తరచుగా స్నేహితులను కలవడం, కుటుంబ సభ్యులను లేదా బంధువులతో కలిసి టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటాం. కానీ కాసేపు ఒంటరిగా ఉండి, మీతో మీరు టైం స్పెండ్ చేసుకుంటే చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది అనే విషయం మీకు తెలుసా?

అయితే ఈ బిజీ లైఫ్ లో మనతో మనం గడపడం మర్చిపోయాము. పైగా ప్రస్తుత తరంలో ఒంటరిగా జీవించే వాళ్ళను చూసి డిప్రెషన్ లో ఉన్నారు అని అనుకుంటారు. కానీ అది ఏ మాత్రం నిజం కాదు. ఒంటరిగా జీవించడం వల్ల ఆ వ్యక్తి రాబోయే ఛాలెంజెస్ ను ఎదుర్కోవడానికి తనను తాను రెడీ చేసుకోగలడు. ఈ విషయం ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడైంది. అయితే కాసేపు ఒంటరిగా ఉండడానికి, ధైర్యంగా ఒంటరిగా జీవించడానికి, ఒంటరిగా ఫీల్ అవుతూ డిప్రెషన్ లోకి వెళ్లడానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాను గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. మరి ఒంటరిగా కాసేపు టైం స్పెండ్ చేస్తే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరూ కొంత సమయం ఒంటరిగా కూర్చుని జీవితం గురించి ఆలోచించాలి. దీనివల్ల మనల్ని మనం బాగా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. మన బలాలు, బలహీనతలను సరిగ్గా తెలుసుకుని వాటిని మరింత బెటర్ చేసుకోగలుగుతాం.

- Advertisement -

కాసేపు ఒంటరిగా గడపడం మనలో ఉన్న క్రియేటివిటీని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఒంటరిగా కూర్చుని ఆలోచించినప్పుడు మనకు చాలా కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అలాంటి ఆలోచనలే మనలో ఉన్న క్రియేటివిటీని కూడా పెంచుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మనం మనలా ఉండగలుగుతాం. కానీ ఎవరైనా ఉంటే మనలో ప్రవర్తన మారిపోవడం సాధారణమే.

ఒంటరిగా ఉండడం వల్ల మనల్ని మనం స్వతంత్రంగా మార్చుకోగలుగుతాం. మనం మన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జీవించినప్పుడు మనకు తెలియకుండానే వారిపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాము. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మన బాధ్యతలు మనవి నన్న విషయాన్ని గ్రహిస్తాం. అలా ఆ కొంచెం సేపు ఒంటరిగా గడపడం వల్ల మనం స్ట్రాంగ్ అవుతాం.

ఇక జీవితంలో ఒత్తిడి ఉంటే కచ్చితంగా మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. అప్పుడే ఆ ఒత్తిడి తగ్గుతుంది.

అంతేకాకుండా ఒంటరిగా ఉండడం వల్ల మనం శక్తిని ఆదా చేసుకోగలుగుతాం. అదెలాగంటే సాధారణంగా మనం ఎక్కడో ఒక గుంపులో ఉన్నప్పుడు మన దృష్టి అంతా ఇతరుల పైనే ఉంటుంది. కానీ మనం ఒంటరిగా కూర్చుని, మన గురించి మనం ఆలోచిస్తే ఆ శక్తిని మన పైనే పెట్టుకుంటాం.

అయితే ఈ బెనిఫిట్స్ అన్ని చూసాక మీతో మీరు ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారా? అయితే ఆ కొంచెం సమయం మరింత ఆహ్లాదకరంగా ఉండాలంటే పుస్తకాలను చదవడం, వ్యాయామం వంటివి చేయవచ్చు.

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు