Salaar Tickets: మైత్రీ వారి బుర్ర తక్కువ పని… ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారా?

ఎవరైనా టెక్నాలజీని వాడటంలో ముందుకు వెళ్లాలని అనుకుంటారు. కానీ, మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం వెనక్కి వెళ్లాలని అనుకుంటున్నారు. వాళ్లు ఒక్కరే వెళ్తే పర్లేదు. సినిమా లవర్స్ ని కూడా వెనక్కి తీసుకోపోవాలని చూస్తున్నారు. ఎందులో వెనక్కి.. అసలు మ్యాటరేంటంటే…

మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంటే… సలార్. ఈ మూవీ కోసం సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు.. నార్త్ వాళ్లు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. అన్ని స్టేట్స్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ బుకింగ్స్‌లో సలార్ రికార్డులను కూడా క్రియేట్ చేస్తుంది. కానీ, నైజం ఏరియాలో మాత్రం Bringing Back The Glory of Mass Cinema నడుస్తుంది.

సలార్ సినిమా నైజం రైట్స్ తీసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ఓ బుర్ర తక్కువ పని చేస్తుంది. ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీ టికెట్లను ఆన్ లైన్ సైట్స్ లో పెట్టడానికి రెడీగా లేరు. సలార్ సినిమా చూడాలంటే.. థియేటర్స్ ముందు క్యూ కట్టాలట. టికెట్స్ కోసం చొక్కాలు చించుకోవాలట. బాడీ నుజ్జు నుజ్జు చేసుకుంటేనే సలార్ టికెట్స్ వస్తాయట. అలా ప్లాన్ చేస్తున్నారు ది గ్రేట్ ప్రొడ్యూసర్స్ మైత్రీ వాళ్లు.

- Advertisement -

ఆడియన్స్ ఎలాంటి ఇబ్బందులు పడినా ఏం కాదు. కానీ, దీని వల్ల ఫస్ట్ ఇబ్బంది పడేది వాళ్లే. ఎలా అంటే… ఇంత హైప్ ఉన్న ఈ సినిమాకు ప్లాప్ టాక్ వస్తే.. పరిస్థితి ఏంటి? సలార్ కు ప్లాప్ టాక్ ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్న రావొచ్చు. కానీ, గతంలో ప్రభాస్ నటించిన సినిమాలు ఇలాగే భారీ హైప్ తో వచ్చి బాక్సాఫీస్ ముందు కోలుకోలేకుండా చితికిలపడ్డాయి. అలా అయిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలను ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. వీటిలాగే సలార్ కు డిజాస్టార్ టాక్ వస్తే.. కలెక్షన్ల పరిస్థితి ఏంటి? ఇలాంటి బుర్ర తక్కువ ఆలోచన చేసిన మైత్రీ మూవీ మేకర్స్ పరిస్థితి ఏంటి?

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లలో 60 నుంచి 70 శాతం వరకు ఫస్ట్ వీకెండ్ లోనే వచ్చాయి. ఈ ఫస్ట్ వీకెండ్ లోనే ఎందుకంటే… అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల. ఈ రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. రిలీజ్ డేట్ తో పాటు వీకెండ్ వరకు ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ టికెట్లు బుక్ చేసుకున్నారు. కాబట్టి.. బయ్యర్లకు కొంత వరకు అయిన డబ్బులు వచ్చాయి.

కానీ ఇప్పుడు సలార్ కు ఇలాంటి పరిస్థితి లేదు. ఒక ఫ్లాప్ టాక్ వచ్చిందంటే.. ఆడియన్స్ థియేటర్ వైపు కూడా చూడరు. ఇక క్యూలో నిలబడి టికెట్లు తీసుకునే ధైర్యం అసలే చేయరు. దీంతో సాహా, రాధేశ్యామ్ కు వచ్చిన కలెక్షన్లు కూడా రావు అనే చెప్పొచ్చు. ఈ చిన్న విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ గ్రహిస్తే.. Bringing Back The Glory of Mass Cinema లాంటి సాహాసాలు చేయరు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు