White Egg vs Brown Egg : ఈ ఎగ్స్ లో తేడా ఏంటి? పోషకాలు ఎందులో ఎక్కువగా ఉంటాయంటే?

రోజుకో గుడ్డును తినడం ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో తెల్ల కోడి గుడ్లతో పాటు, గోధుమ రంగులో ఉండే ఎగ్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. మరి ఈ రెండు రకాల గుడ్లలో ఉండే తేడా ఏంటి? ఏ రకమైన ఎగ్స్ తో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి? ఏ రకమైన ఎగ్స్ తింటే ఆరోగ్యానికి మంచిది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలలో గుడ్డు కూడా ఒకటి. సీజన్ ఏదైనాప్పటికీ రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇక గుడ్లలో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎగ్స్ తినడం వల్ల శరీరంలోని ఎముకలు బలంగా తయారవుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అయితే రెండు రకాల గుడ్ల మధ్య తేడా ఏంటి? అంటే రంగు మాత్రమే. కోడికి గోధుమ రంగు ఈకలు ఉంటే కోడి గుడ్డు కూడా గోధుమ రంగులో ఉంటుంది. కోడికి తెల్లటి ఈకలు ఉంటే అది పెట్టే గుడ్డు కూడా తెల్లగానే ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం రెండు గుడ్లలో పోషకాలు సమానంగా ఉంటాయి. అయితే వాటిలో ఉండే పోషకాలు ఎంత విలువైనవి అనే విషయం అవి తినే ఆహారం, నివసించే స్థలం పై ఆధారపడి ఉంటుంది.

మరి రెండు గుడ్లలో సమానమైన పోషకాలు ఉన్నప్పుడు బ్రౌన్ ఎగ్స్ కు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? వాటి ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది? అంటే… తెల్ల గుడ్లకు బదులుగా బ్రౌన్ ఎగ్స్ తింటే ఆరోగ్యానికి మంచిది అనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. దానికి కారణం ఏమిటంటే బ్రౌన్ ఎగ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా తెల్ల కోళ్ల కంటే ఈ రకమైన కోళ్లకు మంచి సంరక్షణ, ఆహారం ఉంటాయి. కాబట్టి అవి ఆరోగ్యంగా ఉంటాయని, బ్రౌన్ కలర్ ఈకలు ఉన్న కోళ్లు పెట్టే ఎగ్స్ ఆరోగ్యానికి మంచిది అని నమ్ముతారు. ఇక తెల్ల కోళ్ల విషయానికి వస్తే వాటిని ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాల కోసం ఫామ్స్ లో పెంచుతూ ఉంటారు. ఆ సమయంలో వాటికి అనేక రకాల ఇంజక్షన్లు ఇస్తారన్న విషయం తెలిసిందే. గుడ్లలో ఉండే పోషకాల విషయానికి వస్తే అవి కోడి తీసుకునే ఆహారం, సంరక్షణ పై ఆధారపడి ఉంటాయి. కోళ్లకు తగినంత ఎండ లభించి, ఆహారం బాగుంటే రెండు రకాల ఎగ్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

- Advertisement -

ఇక బ్రౌన్ ఎగ్స్ లో విటమిన్ ఏ, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఈ, ఫోలేట్, సెలీనియం, కోలిన్ వంటి ఖనిజాలు ఎగ్స్ లో ఉంటాయి. అయితే బ్రౌన్ ఎగ్స్ లో మాత్రం ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. అంతేకానీ ఎగ్స్ లో ఉండే ప్రోటీన్లపై గుడ్డు పెంకు గాని, వాటి కలర్ గాని ఏమాత్రం ఎఫెక్ట్ చూపించదు అనేది నిజం.

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు