Allari Naresh: ఆ హీరోయిన్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న నరేష్.. కారణం..?

ప్రముఖ దర్శకుడు ఈవీవీ.సత్యనారాయణ వారసుడిగా అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అదే పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేసి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న ఈయన ఎప్పుడూ కామెడీ సినిమాలే చేస్తే.. చూసే జనాలకు బోరు కొడుతుందని అప్పుడప్పుడు గమ్యం లాంటి గుర్తుండే పోయే పాత్రలు కూడా చేశారు.

ఇప్పుడైతే కామెడీ జానర్ ని పూర్తిగా పక్కకు పెట్టి.. నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మరింత ముందుకు వెళుతున్నారు నరేష్. అంతేకాదు ఇలా కంటెంట్ సినిమాలతోనే హిట్స్ అందుకుంటున్నాడు. ఇకపోతే తాజాగా అల్లరి నరేష్ నాగార్జున హీరోగా నటిస్తున్న నా సామిరంగా అనే సినిమాలో అంజి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే .ఈ పాత్ర గురించి డైరెక్టర్ చెబుతూ గమ్యం తర్వాత అల్లరి నరేష్ పేరు 50 రెట్లు మారుమ్రోగుతుంది అంటూ వెల్లడించారు. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ కు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

అందులో భాగంగానే అల్లరి నరేష్ సాధారణంగా ఒక సినిమా లో చేసిన హీరోయిన్ తో మరోసారి సినిమా చేసే అలవాటు లేదు. కానీ ఫర్జానా అనే హీరోయిన్ తో ఏకంగా మూడు నుండి నాలుగు సినిమాలు చేశారు నరేష్. ఇక అలా అల్లరి నరేష్ ఫర్జానా మధ్య అలాంటి పుకార్లు ఎన్నో సృష్టించారు . కొన్ని వెబ్సైట్స్ అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని కూడా వార్తలు రాశారు. ఇది చూసిన ఈవీవీ సత్యనారాయణ ఎవరు రా నా కోడలు? ఇంటికి తీసుకొని రా చూద్దామంటూ సరదాగా అనేవారట. ఇక తర్వాత వీరి మధ్య బ్రేకప్ అయిందని వార్తలు కూడా వినిపించాయి.

- Advertisement -

ఇక దీనిపై అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సాధారణంగా హీరోయిన్స్ షూటింగ్ వచ్చేటప్పుడు ఎవరైనా తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకొని లొకేషన్ కి వచ్చేవాళ్ళు. కానీ ఆమె మాత్రం తన బాయ్ ఫ్రెండ్ ను వెంటపెట్టుకొని షూటింగ్ స్పాట్ కి వచ్చేది. ఇలా కమిట్ అయిన అమ్మాయితో మళ్ళీ నాకు కొత్తగా ప్రేమాయణం ఏంటి అంటూ తెలిపారు అల్లరి నరేష్ .. మొత్తానికి తనపై వచ్చిన రూమర్స్ కి గట్టి క్లారిటీ ఇచ్చారు.

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు