Nani: ఈ ఏడాది ఆ ఘనత దక్కించుకున్న ఏకైక హీరో.. అదేంటంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న నాని ఆ తర్వాత వరుసగా పలు సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇక హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న నాని ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా కూడా మరింత బిజీగా మారిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా నానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే రెండు పూర్తి భిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు నాని.. ఈయన నటించిన ఈ రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇక ఏంటా సినిమాలు..? ఏంటో ఆ రికార్డు? అనే విషయానికి వస్తే.. ప్రథమార్థం లో దసరా సినిమాతో మాస్ హిట్ అందుకున్న నాని.. ద్వితీయార్థంలో హాయ్ నాన్నతో క్లాస్ హిట్ ని అందుకున్నాడు.ఇకపోతే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై దసరా సినిమాను నిర్మించగా.. మార్చి 30వ తేదీన విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ .115 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. మరోవైపు హాయ్ నాన్న సినిమా కూడా దాదాపు అదే రేంజిలో దూసుకుపోతోందని చెప్పవచ్చు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు.

ఇలా ఈ రెండు సినిమాలు కూడా ఆయనకు ఒకటి మాస్ మరొకటి క్లాస్ విజయాలను అందించాయి. ఇక అలా ఈ ఏడాది ఒక మాస్ హిట్.. మరొకటి క్లాస్ హిట్ అందుకున్న ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నాని ఏది ఏమైనా ఈ ఏడాది ఇలాంటి అరుదైన ఘనత సాధించిన హీరోగా రికార్డ్ సృష్టించారు. ఏది ఏమైనా నాని కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ.. అంతకుమించి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఏది ఏమైనా నాని ఇలాంటి రికార్డ్స్ మరెన్నో సృష్టించాలని ఆయన అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా కోరుకుంటూ ఉండడం గమనార్హం.

- Advertisement -

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు