Kareena kapoor: బాలీవుడ్ సీక్రెట్స్ లీక్ చేస్తున్న బ్యూటీ- కరీనా కపూర్ వ్యవహారం బట్టబయలు ?

రీసెంట్ గా రిలీజైన బాలీవుడ్ సినిమా గదర్2 గురించి అందరికి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా హిందీలో సాలిడ్ హిట్ సినిమా లేక వెలవెల బోతున్న బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కళకళలాడేలా చేస్తుంది గదర్ 2. సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచే గదర్ 2 సినిమాకు ప్రేక్షకుల దగ్గరి నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామిని సృష్టిస్తుంది.

ఈ తరుణంలో గదర్ 2 సినిమాలో నటించిన నటీనటులకు ఒక్కసారిగా పాపులర్ అవడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలతో బాలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తెలుగులో పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో మరియు మహేష్ బాబుతో నాని సినిమాలో నటించిన అమీషా పటేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి కొన్ని విషయాలకు మీడియా ముఖంగా బయట పెట్టగా ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

- Advertisement -

అయితే అమీషా పటేల్ హీరోయిన్ గా అరంగ్రేటం చేసిన సినిమా కహో నా ప్యార్ హై. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించాడు. 2000 ఇయర్ లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్ లో సంచలన విజయాన్ని సాదించింది. ఈ సినిమాతోనే అమీషా పటేల్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కూడా అయింది. అయితే నిజానికి కహో నా ప్యార్ హై సినిమాలో హీరోయిన్ గా అమీషా పటేల్ కన్నా ముందు కరీనా కపూర్ ను తీసుకున్నారట.

అఫీషియల్ అగ్రీమెంట్స్ కూడా అన్నీ పూర్తయ్యాక రాకేష్ రోషన్ తో కరీనా కపూర్ గొడవ పడటం కారణంగా ఆయన కహో నా ప్యార్ హై సినిమా నుంచి కరీనా కపూర్ తొలగించి ఆమెకు బదులు అమీషా పటేల్ ను హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు.అలాగే తెలిసిన కూడా జరిగే నష్టం కూడా పెద్దగా లేదు. కానీ అమీషా పటేల్ ఈ ప్రత్యేక పరిస్థితులలో ఈ విషయాన్ని మీడియాకు చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు