Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్… పూర్తి వివరాలు

Bigg Boss Season 7 Telugu

ప్రముఖ రియాలిటి షో బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయింది. మొదటి ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ అయింది. ఈ మొదటి ఎపిసోడ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ 14 కంటెస్టెంట్స్ పేర్లు, వారి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి ఎపిసోడ్ హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్‌తో స్టార్ట్ చేశారు. ముందుగా బిగ్ బాస్ గురించి కొన్ని విషయాలను పంచుకున్న నాగార్జున ఆలస్యం చేయకుండా కంటెస్టెంట్స్‌ను పరిచయం చేశాడు. దీని తర్వాత పలు గెటెప్స్ తో కనిపిస్తూనే ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఉండే విధానాన్ని వివరించాడు.

ఇక ఈ సీజన్ 7లో మొదటి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. రెండో కంటెస్టెంట్‌గా హీరో శివాజీ వచ్చాడు. మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని, నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ వచ్చారు. అనంతరం శుభశ్రీ, షకీలా, ఆట సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతిక రోజ్, గౌతమ్ క్రుష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ తర్వాతి కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు.

- Advertisement -

కంటెస్టెంట్స్ పరిచయం తర్వాత ఖుషి ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్ కోసం నవీన్ పోలిశెట్టి హౌస్ లో కొంత సమయం సందడి చేసి వెళ్లిపోయారు. విజయ్ దేవరకొండ వచ్చిన సమయంలో “మీ సమంత ఏది” అంటూ బిగ్ బాస్ వేదికగా తన మాజీ కోడలను గుర్తు చేసుకున్నాడు నాగార్జున. ఇది ఫస్ట్ ఎపిసోడ్‌లో హైలైట్ గా నిలిచింది.

కంటెస్టెంట్స్ – వారి వివరాలు….

ప్రియాంక జైన్

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ సీరియల్ స్టార్ గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జైన్. ఈమె వినరా సోదరా వీర కుమార, చల్తే చల్తే, ఎవడూ తక్కువ కాదు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అలాగే మౌనరాగం అనే సీరియల్ లో తనతో నటించిన శివకుమార్ తో ప్రియాంక జైన్ ప్రస్తుతం ప్రేమలో ఉంది.

శివాజీ

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

తెలుగు ప్రేక్షకులకు శివాజీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరో ఇమేజ్ ఉన్న శివాజీ ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. గతంలో మిస్టర్ అండ్ మిసెస్ శైలాజా క్రుష్టమూర్తి, మిస్టర్ ఎర్రబాబు, మిస్సమ్మ్, తాజ్ మహాల్ లాంటి ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. శివాజీ చివరి సినిమా 2016లో సీసా. చివరి వెబ్ సిరీస్ గ్యాంగ్ స్టార్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) దీని తర్వాత మళ్లీ ఎక్కడా కనిపంచదలేదు.

దామిని భట్ల

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో సాంగ్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ ను పాడిన దామిన భట్ల కూడా అందరికీ పరిచయమే. కొండపొలం సినిమాలో ధమ్ ధమ్ ధమ్ సాంగ్ కూడా దామినికి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సాంగ్ కు ఇటీవల నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కాగా, 2011లో దామినీ పాడుతా తీయ్యగాలో సెకండ్ ప్రైజ్ కొట్టేసింది. ఇప్పుడు సినిమా పాటలే కాదు, సొంతంగా ప్రయివేట్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది.

ప్రిన్స్ యావర్

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు ప్రిన్స్ యావర్. ఇతడు ఓ ఫేమస్ మోడల్. గతంలో ఓ తెలుగు సీరియల్ లో కూడా నటించాడు. ఇక మోడలింగ్‌ను వదిలి ఉద్యోగం చేసుకుందామనే ఆలోచనలో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట.

శుభ శ్రీ

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

లా చదువుతూ మోడలింగ్ చేసిన శుభ శ్రీ, 2002లో రుద్రవీణ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో రాకముందు లాయర్ గా చేసిన శభ శ్రీ పీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీల్లో కిరీటం గెలుచుకుంది.

షకిలా

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

నటి షకిలా గురించి ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోల్డ్ సినిమాలు, క్యారెక్టర్స్ చేస్తూ ఫేమస్ అయిన షకిలా ఆరో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. షకిలా గతంలో కూడా బిగ్ బాస్ లో పాల్గొన్న అనుభవం ఉంది.

సందీప్

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

సందీప్ కంటే, ఆట సందీప్‌గా అందరికీ పరిచయం. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు. ఓంకార్ అన్నయ్య స్టార్ట్ చేసిన ఆట ఫస్ట్ సీజన్ లో గెలిచి, ఇప్పుడు కొరియోగ్రాఫర్ వరకు ఎదిగాడు.

శోభా శెట్టి

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

తెలుగు ఆడియన్స్ కి కార్తీక దీపం సీరియల్ ఎంత కనెక్ట్ అయిందో అందరికీ తెలుసు. ఇందులో మోనిత క్యారెక్టర్ గురించి కూడా అందరికీ పరిచయమే. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రకు సీరియల్ లవర్స్ ఇప్పటి వరకు బాగానే అలరించింది. ఆ మోనితనే ఈ శోభా శెట్టి.

టేస్టీ తేజ

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిన యూట్యూబర్ టేస్టీ తేజ. ప్రారంభంలో జబర్ధస్త్ కామెడీ షోలో కనిపంచిన తేజ, ప్రస్తుతం యూట్యూబ్ నే ఎక్కువ నమ్ముకున్నాడు.

రతిక

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

తెలుగులో బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే సినిమాలో ఓ పాత్ర, రీసెంట్ గా నేను స్టూడెంట్ సర్ అనే సినిమాలో పోలీసాఫీసర్ గా చేసిన నటి రతిక. ఈ సినిమాలో కాదు, తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కానీ, పెద్దగా గుర్తింపు రాలేదు.

గౌతమ్

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

తెలుగులో ఆకాశ వీధుల్లో అనే సినిమాలో హీరోగా కనిపించాడు డాక్టర్ గౌతమ్ క్రుష్ణ. డైరెక్టర్ కావాలనే గోల్ తో ఇండస్ట్రీకి వచ్చిన గౌతమ్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 11వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు.

కిరణ్ రాథోడ్

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

ప్రముఖ బాలీవుడ్ నటి రవీన టండన్ కజినే ఈ కిరణ్ రాథోడ్. బాలీవుడ్ లో యాది అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నువ్వు లేక నేను లేను, తమిళంలో జెమిని సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. విజయ్ తలపతి నటిస్తున్న లియో సినిమాలో కిరణ్ రాథోడ్ ఒక పాత్ర చేస్తుందని టాక్.

పల్లవి ప్రశాంత్

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూసే వాళ్లకు పల్లవి ప్రశాంత్ అంటే తెలిసే ఉంటుంది. బిగ్ బాస్ లో అడుగు పెట్టాలనే గోల్ తో వీడియోలు చేసిన యువ రైతు పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7లో 13వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు.

అమర్ దీప్

Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details
Bigg Boss Season 7 Telugu Contestants List and Full Details

సినిమాలు, సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన అమర్ దీప్ ప్రస్తుతం సీరియల్స్ లో హీరో పాత్రలు చేస్తున్నాడు. గతంలో రాజుగారి కిడ్నాప్, అభిలాష, ఐరావతం, ప్రేమ దేశం లాంటి సినిమాల్లో కనిపించిన అమర్ దీప్, బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించడం ఇది రెండో సారి. బిగ్ బాస్ సీజన్ 5వ లో కంటెస్టెంట్ మానస్ కు సపోర్ట్ గా వచ్చాడు. ఇప్పుడు 14వ కెంటెస్టెంట్ గా డైరెక్ట్ హౌస్ లోకే అడుగుపెట్టాడు.

చివరగా 15వ కంటెస్టెంట్ అంటూ నవీన్ పొలిశెట్టిని పిలిచారు. ఈ యంగ్ హీరో ఒక్క రోజు హౌస్ లో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రతి సీజన్ 20 మంది కంటెస్టెంట్స్ ఉండేవాళ్లు. కానీ, ఈ 7వ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో 14 మందిని మాత్రమే పరిచయం చేశారు. మిగితా 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా? లేదా ఉల్టా పల్టాలో భాగంగా ఎప్పుడైనా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేలా నాగ్ ప్లాన్ చేశాడా ? అనేది తెలియాల్సి ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు