NTR: వార్ 2 కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా..?

RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాతో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో చేసే సినిమాపై దృష్టి పెడతాడని తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా విష్ చేస్తూ హృతిక్ చేసిన ట్వీట్ వార్ 2 సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా ఆ సినిమా గురించి మరొక ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకా షూటింగ్ మొదలవ్వాల్సి ఈ సినిమాను 2025 జనవరి 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు.

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవనుండగా, ఆ తర్వాత సుమారు ఏడాది గ్యాప్ తర్వాత వార్2 సినిమా రానుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కంటే ముందు వార్ 2 రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వార్2 సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో నటించనున్నాడు అన్న వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరో పక్క దేవర సినిమా ఇటు ఎన్టీఆర్ కి, అటు కొరటాల శివకి కీలకంగా మారింది. ఎందుకంటే, RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావటంతో రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుందన్న సెంటిమెంట్ ని అధిగమిస్తాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది. ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకొని ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకొని తన సత్తా చాటాలని కొరటాల భావిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆసక్తి పెంచుతున్న నేపథ్యంలో రిలీజ్ అయ్యాక ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు