Sankranthi Race : వాళ్ళలా వీళ్లూ కం బ్యాక్ ఇస్తే? రచ్చ రచ్చే..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో సీనియర్ స్టార్ హీరోస్ నటించిన సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “సైంధవ్” ఒకటి కాగా , మరొకటి కింగ్ నాగార్జున నటించిన “నా సామిరంగ” కూడా ఉంది. ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. అయితే అసలు విషయానికి వస్తే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్స్ గా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఉండేవారు. గత నాలుగు దశాబ్దాలుగా ఈ హీరోలు తమ స్థాయిని కంటిన్యూ చేస్తూ ఉండగా, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ హీరోస్ స్వింగ్ లోకి వచ్చినా, వీళ్ళ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.

అయితే గత కొంత కాలంగా వీళ్ళ నుండి సరైన సినిమాలు రాకపోగా, లాస్ట్ ఇయర్ 2023 సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య తో, బాలకృష్ణ వీర సింహారెడ్డి తో బ్లాక్ బస్టర్స్ కొట్టి ఒక మాస్ కం బ్యాక్ ఇవ్వగా, ఈ ఇయర్ నాగార్జున, వెంకటేష్ తమ సినిమాలతో 2024 సంక్రాంతికి సందడి చేయడానికి వస్తున్నారు. వెంకటేష్ సైంధవ్ సినిమాతో జనవరి 13న వస్తుండగా, నాగార్జున జనవరి 14న నా సామిరంగ తో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ హీరోలు కూడా గత కొంత కాలంగా ప్లాపులతో డీలా పడ్డారు. నిజం చెప్పాలంటే లాక్ డౌన్ తర్వాత వీళ్ళ నుండి వచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేదు.

ఇక లాస్ట్ ఇయర్ చిరంజీవి, బాలకృష్ణ లకు కలిసొచ్చినట్టే ఈ సంక్రాంతికి ఈ సీనియర్ స్టార్స్ కం బ్యాక్ ఇస్తారా అనేది సోషల్ మీడియా లో రచ్చగా మారింది. ఇక రాబోతున్న రెండు సినిమాలు కూడా టీజర్, ట్రైలర్ లతో మెప్పించాయి. పైగా ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళ సినిమావైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. కానీ సంక్రాంతికి సినిమాల పోటీ ఎక్కువ అవడం వల్ల సినిమాలకు నెగిటివ్ రెస్పాన్స్ వస్తే వారం పూర్తికాకముందే థియేటర్ల నుండి తొలగించే అవకాశం ఉంది. ఇక ఈ ఇయర్ ఈ సీనియర్ స్టార్స్ గనక కం బ్యాక్ ఇచ్చినట్లయితే సీనియర్ హీరోల ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు