Sandhav Trailer : అంతా ట్రైలర్ లోనే చెప్పేశారేంటి?

Sandhav Trailer : వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సైంధవ్” మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ నిడివి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు దారి తీసింది. నిడివి పరంగా చూసుకుంటే ఇప్పటిదాకా విడుదలైన పాన్ ఇండియా సినిమాలతో సహా అన్ని సినిమాల కంటే “సైంధవ్”మూవీ ట్రైలర్ నిడివి ఎక్కువగా ఉంది. ఏకంగా 3 నిమిషాల 36 సెకండ్ల నిడివితో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

అంతేకాకుండా సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ స్టఫ్‌ను ట్రైలర్‌లోనే రివీల్ చేశారు. అలాగే స్టోరీ కూడా క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఉంది ఈ ట్రైలర్‌లో. మరి అంతా ట్రైలర్ లోనే చెప్పేస్తే సినిమా చూడడం దేనికి అని అనుకుంటున్నారా? వెంకీ మామ మోస్ట్ వైలెన్స్ పర్ఫామెన్స్ ఈ మూవీలోనే చూడగలం కాబట్టి. అలాగే డైరెక్టర్ శైలేష్ కొలను స్క్రీన్ ప్లే గురించి కూడా.

ఇక ట్రైలర్ లో రిలీజ్ చేసిన ఆసక్తికరమైన అంశాల్లో తమిళ హీరో ఆర్య క్యారెక్టర్ ఒకటి. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని వెల్లడించారు కానీ, ఆర్య హీరో సైడ్ ఉంటాడా, లేదంటే ఈ మూవీలో మరోసారి విలన్‌గా కనిపించబోతున్నాడా అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు. ట్రైలర్లో ఆర్యను చూసిన వారంతా ఈ సర్ప్రైజ్ ను సినిమాలో రివీల్ చేస్తే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. ఇక డైరెక్టర్ శైలేష్ కొలను స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గత చిత్రం “హిట్ 2” చూసినవారికి ఈ విషయం బాగా తెలుసు.

- Advertisement -

ఆ మూవీలో విలన్ ఎవరన్న విషయాన్ని చివరి వరకు సస్పెన్స్ లో ఉంచి, ఆఖరకు ఆయన ట్విస్ట్ ను బయట పెట్టిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాబట్టి “సైంధవ్” ట్రైలర్ లోనే స్టోరీ మొత్తాన్ని రివీల్ చేసినప్పటికీ శైలేష్ వల్ల సినిమాపై అంచనాలు పెరుగుతాయి తప్ప తగ్గవు అన్నది వెంకీ మామ ఫాన్స్ ఒపీనియన్.

కాగా “సైంధవ్” మూవీ వెంకీకి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఎందుకంటే ఈ మూవీ ఆయన కెరీర్లో 75వ చిత్రంగా రూపొందింది. ఈ మూవీలో వెంకీ మామ ఇదివరకటిలా కేవలం ఫ్యామిలీ హీరోగా కాకుండా విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు. కథలో ఇంకా ఎవరు ఊహించని లేయర్స్ ఉన్నాయని విషయాన్ని ట్రైలర్ ద్వారా వెల్లడించారు.

ఫ్యామిలీ డ్రామాగా మొదలైన ట్రైలర్ ఎండ్ అయ్యే సమయానికి వెంకటేష్‌లోని బీభత్సమైన యాంగిల్‌ను బయటపెట్టారు. ఇక ట్రైలర్లో వెంకటేష్ చెప్పిన గ్రిప్పింగ్ డైలాగ్స్, కొన్ని వైలెన్స్ సన్నివేశాలు హైలెట్స్‌గా నిలిచాయి. కాగా “సైంధవ్” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు