Venkatesh : వెంకీ మామ సంక్రాంతి సెంటిమెంట్… ఇప్పటి వరకు ఎన్ని హిట్స్ అంటే ?

Venkatesh : ఫ్యామిలీ హీరోగా విక్టరీ వెంకటేష్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఫ్యామిలీ హీరోగా వెంకీకి ఉన్న క్రేజ్ స్పెషల్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ హీరో తన రూటు మార్చి మోస్ట్ వైలెంట్ గా కనిపించబోతున్నాడు తన కొత్త మూవీలో. వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సైంధవ్”. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి రాబోతోంది.

అయితే వెంకటేష్ గతంలో నటించిన కొన్ని చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజై ఆయన కెరీర్ లోనే మరిచిపోలేని సినిమాలుగా మిగిలాయి. అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఈసారి కూడా తన కొత్త మూవీతో సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు వెంకీ. మరి సంక్రాంతికి రిలీజ్ అయిన వెంకీ సినిమాలు ఏవి? అందులో ఎన్ని హిట్ అయ్యాయి? అనే వివరాల్లోకి వెళితే…

1. చంటి

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify
రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, మీనా హీరోయిన్ గా నటించిన “చంటి” మూవీ అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1992 జనవరి 10న అంటే సంక్రాంతి కంటే ముందే రిలీజ్ అయిన ఈ మూవీ పాటలు ప్రతి ఇంట్లోనూ మార్మోగిపోయాయి. ఇక మూవీ కూడా వెంకటేష్ కెరీర్లో భారీ కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల లిస్ట్ లో చేరిపోయింది.

2. కలిసుందాం రా

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify
వెంకటేష్, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2000 జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ మూవీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. కుటుంబ విలువలు, లవ్ వంటి రెండు అంశాలను మిళితం చేసి ఈ మూవీని రూపొందించారు. అప్పట్లో ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది.

3. లక్ష్మీ

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify
వెంకటేష్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాలు లిస్ట్ లో ఈ మూవీ కూడా ఉంటుంది. ఇందులో వెంకటేష్ హీరోగా నటించగా, చార్మి కౌర్, నయనతార ఆయనతో ఈ మూవీలో రొమాన్స్ చేశారు. ఈ మూవీలో వెంకటేష్ పవర్ఫుల్ బిజినెస్ మెన్ గా నటించాడు. 12 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ అప్పట్లోనే 22 కోట్ల దాకా రాబట్టింది. ఇక రమణ గోగుల, మణిశర్మ సంగీతం ఈ మూవీకి మరో హైలెట్. “లక్ష్మీ” మూవీ కూడా జనవరి 14న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

4. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify
టాలీవుడ్ ఆడియన్స్ ఫేవరెట్ సినిమాలలో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” తప్పకుండా ఉంటుంది. వెంకటేష్, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇక 2013 జనవరి 11న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్ లో ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అప్పటిదాకా మల్టీస్టారర్ మూవీలు అంటే భయపడేవారు టాలీవుడ్ మేకర్స్. కానీ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మూవీతో శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుకునే వారికి ఇన్స్పిరేషన్ గా నిలిచి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ దానికి డబుల్ 85 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

5. F2

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify
ఇక వెంకటేష్ కెరీర్ లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో “ఎఫ్2” ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా రూపొందిన “ఎఫ్2” ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడికి మూడింతల కలెక్షన్లను రాబట్టింది. 2019 జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైంది. తర్వాత ఈ మూవీ 130 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది.

ఇలా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలన్నీ కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. ఈ సంక్రాంతి కానుకగా రాబోతున్న “సైంధవ్” ఇదే సెంటిమెంట్ కలిసి రావాలని కోరుకుందాం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు