Santosh Sobhan: ఈ వేసవికి చల్లని చిరుగాలిని ఇస్తుందా? చిరాకు పెడుతుందా..?

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మితమైన సినిమా ‘అన్ని మంచి శకునములే’ విడుదలకు సిద్ధంగా ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా మే 18న విడుదల కానుంది. కెరీర్లో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ హిట్ లేని హీరో సంతోష్ శోభన్ కి ఈ సినిమా కీలకంగా మారింది. ఓ బేబీ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నందిని రెడ్డి, ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయటంతో సినిమా మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా హిట్ అయితే, సంతోష్ శోభన్ తో పాటు హీరోయిన్ మాళవిక నాయర్ కి కూడా మంచి బ్రేక్ వస్తుంది.
సమ్మర్ సీజన్లో దసరా, విరూపాక్ష సినిమాలు మినహా ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవటం అన్నీ మంచి శకునములే సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి. విరూపాక్ష సినిమా థియాట్రికల్ రన్ ముగియటంతో హిట్ సినిమా లేక థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే, వేసవి కాలం సెలవుల సీజన్ కావటంతో తెలుగు జనాలకు ఉన్న మొదటి రిక్రియేషన్ ఆప్షన్ సినిమాగా భావిస్తారు. అలాంటిది ప్రస్తుతం హిట్ సినిమాలు లేకపోవటం వల్ల తెలుగు ప్రేక్షకుడికి సమ్మర్ ఆహ్లాదాన్ని అందించలేకపోయింది.
పైగా, ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్ని యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో రూపొందినవి అవ్వటం, అన్నీ మంచి శకునములే లాంటి ఫీల్ గుడ్ సినిమాలు లేకపోవటం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేసిన ఈ సినిమాకు తొలి ఆటతో పాజిటివ్ టాక్ గనక తోడైతే సునాయాసంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పచ్చు. మరి, ‘ఈ వేసవికి చల్లని చిరుగాలి’ అన్న ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుడిని సేద తీరుస్తుందా లేక మండే ఎండల్లో మరింత విసిగిస్తుందా చూడాలి.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు