Ram Charan: గేమ్ చేంజర్ అరవ అపవాదును చెరిపేస్తుందా..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాను 2024 ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కావటంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తమిళ డైరెక్టర్లతో తెలుగు హీరోలు చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ ఫ్లాప్ అవ్వటం మెగా అభిమానులను కలవరపెడుతోంది. ఇటీవల నాగచైతన్య వెంకట్ ప్రభుల కాంబినేషన్లో వచ్చిన కస్టడీ సినిమా డిజాస్టర్ అవటంతో అనుమానం మరింత పెరిగింది. నిజానికి వెంకట్ ప్రభు సినిమాలు విభిన్న కథాంశంతో అలరిస్తాయన్న బ్రాండ్ ఉండేది, కస్టడీ సినిమా కథలో అది లోపించటంతో డిజాస్టర్ గా మిగిలింది.
గతంలో మహేష్ బాబు హీరోగా మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన స్పైడర్ కూడా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. కథ పరంగా బాగానే ఉన్నా కానీ, తెలుగు నేటివిటీ లోపించటం వల్ల స్పైడర్ సినిమా వర్కౌట్ అవ్వలేదు. మరొక తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వచ్చిన వారియర్ సినిమా ఎంతటి డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శంకర్ ఇప్పటివరకు స్ట్రైట్ తెలుగు సినిమా చేయకపోయినా, అతని సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే, శంకర్ ని మిగతా దర్శకులతో పోల్చలేం కానీ, అతను డైరెక్ట్ చేస్తున్న తొలి తెలుగు సినిమా కావటంతో తమిళ డైరెక్టర్ సెంటిమెంట్ మీద మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈ సినిమాకు నిర్మాత వ్యవహరిస్తున్న దిల్ రాజుకి కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందన్న నమ్మకం గేమ్ చేంజర్ పై ఉన్న అనుమానాలు అనవసరం అనుకునేలోపే ఇటీవల వచ్చిన శాకుంతలం భయపెడుతోంది. ఇప్పటికే 75శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తమిళ డైరెక్టర్లపై పడిన అపవాదుని గేమ్ చేంజర్ సినిమా ద్వారా శంకర్ చెరిపేస్తాడా లేక మరో డిజాస్టర్ ని ఇచ్చి తమిళ దర్శకులను తెలుగు హీరోలు మర్చిపోయే పరిస్థితి తెస్తాడా అన్నది వేచి చూడాలి.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు