NTR 30: మోస్ట్ అవైటెడ్ అప్డేట్ – ఫ్యాన్స్ కి పూనకాలే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. ఈ సినిమా టైటిల్ ‘దేవర’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ ని విడుదల చేసింది సినిమా యూనిట్. మై20న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని 19న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సముద్రం ఒడ్డున కత్తులతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమా థీమ్ ని ప్రతిబింభించే విధంగా ఉంది.
RRR తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్న నేపథ్యంలో తాజాగా వచ్చిన అనౌన్స్మెంట్ పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. ‘సముద్రం నిండా రక్తంతో రాసిన అతని కథలే’ అంటూ ట్యాగ్ లైన్ తో ఉన్న పోస్టర్ చూస్తుంటే సినిమాలో హై రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయన్న ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఆచార్యతో డిజాస్టర్ చవిచూసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్న కొరటాల, ఈ సినిమా ద్వారా తన సత్తా చాటాలని కసితో ఉన్నాడు.
ఎన్టీఆర్ పుఈయినరోజు సందర్బంగా మే 20న సింహాద్రి సినిమా రీరిలీజ్ తో సందడి చేయాలనుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక రోజు ముందే ఫస్ట్ లుక్ వస్తుందన్న ఈ అప్డేట్ మరింత ఉత్సాహం పెంచింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది, ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేస్తారా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు