Custody: ఒకప్పుడు కాసులు కురిపించిన ఫార్ములా – ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదా..?

సినిమాల విషయంలో ట్రెండ్, ఫార్ములా అన్న పదాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో వర్కౌట్ అయిన ఫార్ములా ప్రతిసారి వర్కౌట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు సినిమాల విషయంలో. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఫార్ములా ఇందుకు సరైన ఉదాహరణగా చెప్పచ్చు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ తెచ్చిపెట్టిన ఈ ఫార్ములా కొంతకాలం తర్వాత రొటీన్ అవ్వటంతో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు పోలీస్ ఫార్ములా కూడా ఈ జాబితాలో చేరింది. ఒకప్పుడు పోలీస్ స్టోరీ, అంకుశం, కర్తవ్యం, లాంటి ల్యాండ్ మార్క్ సినిమాలొచ్చాయి పోలీస్ బ్యాక్డ్రాప్ లో. అయితే ఇటీవలి కాలంలో పోలిస్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు.
ఇటీవల నరేష్ పోలీస్ క్యారెక్టర్లో వచ్చిన ఉగ్రం సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేదు. ఇక నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన కస్టడీ సినిమా కూడా ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ కథ ప్రధానంగా సాగుతుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన వారియర్, శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అల్లూరి, సుధీర్ బాబు హీరోగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో వచ్చిన హంట్, కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కాడూరి దర్శకత్వంలో వచ్చిన మీటర్ సినిమాలు కూడా పోలీస్ బ్యాక్డ్రాప్ లో వచ్చి డిజాస్టర్స్ గా మిగిలాయి.
నిజానికి ఫార్ములా ఏదైనా కథ కథనం బాగుంటే ఎలాంటి సెంటిమెంట్ కూడా ఆ సినిమాపై ప్రభావం చూపదు. ఇటవల పోలీస్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో కథ, కథనంలో బలం లేకపోవటం వల్లే ఫ్లాప్ అయ్యాయన్నది గుర్తించాల్సిన నిజం. మరి ఒకప్పుడు కాసులు కురిపించిన ఈ ఫార్ములాతో భవిష్యత్తులో వచ్చే సినిమాలైనా హిట్ గా నిలిచి ఈ పరంపరకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు