Intinti Ramayanam: ‘తెలంగాణ సినిమా’ పై ఉన్న అపవాదు చెరిపేస్తుందా..?

ఇటీవల కాలంలో తెలంగాణ బ్యాక్డ్రాప్ లో రూపొందే సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్ లో సినిమా తీస్తే మినిమమ్ గ్యారెంటీ అన్న ఒపీనియన్ ఏర్పడింది మేకర్స్ లో. మల్లేశం, జాతి రత్నాలు, బలగం లాంటి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వటంతో తెలంగాణ బ్యాక్డ్రాప్ కి డిమాండ్ పెరిగింది. అయితే, తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వచ్చిన చాలా వరకు సినిమాల్లో కథ మందు చుట్టూ తిరగటం పట్ల కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన దసరా, మేం ఫెమస్, పరేషాన్ సినిమాల విషయంలో ఈ విమర్శలు మరింత పెరిగాయి. తెలంగాణ యువత అంటే సోమరిపోతుల్లాగా వీధుల్లో తిరుగుతూ ముందుకి బానిసలై ఉన్నట్టుగా ప్రాజెక్ట్ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన మరొక సినిమా ‘ఇంటింటి రామాయణం’ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. అయితే, ఈ సినిమాలో కూడా మందు సీన్లు ఎక్కువగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిజానికి ఈ సినిమా చాలా కాలం కిందటే ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఏవో కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుంది.అన్నదమ్ముల మధ్య ఏర్పడే మనస్పర్థల చుట్టూ సాగే ఈ సినిమా ట్రైలర్ చూస్తే బలగం సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రురల్ బ్యాక్డ్రాప్ అంటే మందు, మటన్ ప్రస్తావన లేకుండా తీయలేరా అన్న అపవాదుని ఈ సినిమా చెరిపేస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది.

సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేష్, గంగవ్వ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆహా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ అయితే క్రియేట్ కాలేదు. మరో పక్క జూన్ 16న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదల కానున్న క్రమంలో ఇంటింటి రామాయణం సినిమా వసూళ్లు రాబట్టడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఒక రకంగా తెలంగాణ బ్యాక్డ్రాప్  అంటే ప్రేక్షకుడికి బోర్ కొడుతున్న తరుణంలో వస్తున్న ఈ సినిమా మొనాటనీ ని బ్రేక్ చేస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు