Bholaa Shankar: చిరు లీక్స్ – భోళా శంకర్ కి  మెగా బూస్టప్..!

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన సినిమా యూనిట్ వరుస అప్డేట్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసే పనిలో పడింది. ఇటీవల భోళా మేనియా లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. తాజాగా చిరు లీక్స్ అంటూ చిరంజీవి మరో ఆసక్తికర అప్డేట్ వదిలాడు ఇంస్టాగ్రామ్ లో. సినిమాలోని సంగీత్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచాడు మెగాస్టార్. ఈ సాంగ్ కోసం వేసిన కలర్ ఫుల్ సెట్ లో సినిమా యూనిట్ తో కలిసి ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించాడు మెగాస్టార్.

సాంగ్ లో తమన్నా, కీర్తి సురేష్ తో కలిసి చిరు వేసిన చిన్న డ్యాన్స్ మూమెంట్ వింటేజ్ చిరును గుర్తు చేస్తుంది. మొత్తం మీద రీమేక్ అన్న కారణంగా సినిమాపై అభిమానుల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని ఈ వీడియో ద్వారా మాయం చేసే ప్రయత్నం చేసింది సినిమా యూనిట్. ఆరు పదులు దాటిన వయసులో కూడా చిరు యంగ్ లుక్స్ తో ఎనర్జిటిక్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.

చిరు లీక్స్ పేరిట చిరంజీవి సినిమాకు హైప్ క్రియేట్ చేయటం ఇది కొత్తేమి కాదు. ఆచార్య సినిమా టైమ్ లో మొదలైన ఈ చిరు లీక్స్ పరంపర వాల్తేరు వీరయ్య సినిమా సమయంలో ‘నువ్వు శ్రీదేవైతే’ సాంగ్ ని లీక్ చేయటం వరకు సక్సెస్ ఫుల్ గా సాగింది. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకి ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వని నేపథ్యంలో చిరు లీక్స్ తో బరిలో దిగాడు మెగాస్టార్. రీసెంట్ హిట్ వాల్తేరు వీరయ్యతో ఊపు మీదున్న మెగాస్టార్ భోళా శంకర్ తో హిట్ అందుకొని విజయ పరంపరని కొనసాగిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు