Shaakuntalam: ఆ రేర్ ఫీట్ సమంతకు సాధ్యం అయ్యేనా..?

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అరుదుగా వాస్తు ఉంటాయి, హీరో డామినెంట్ అయిన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడాన్ని రిస్క్ గా భావిస్తుంటారు నిర్మాతలు. అప్పట్లో విజయశాంతి ఈ సెగ్మెంట్లో సక్సెస్ ఇప్పటి తరంలో అనుష్క, నయనతార, కీర్తి సురేష్ లాంటి కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే సక్సెస్ అయ్యారు. తాజాగా సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 70కోట్ల భారీ బడ్జెట్ తో లేడి ఓరియెంటెడ్ సెగ్మెంట్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమాగా వస్తోంది. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ లో చేస్తోంది సినిమా యూనిట్. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు కూడా వేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా.
గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఆసక్తి పెంచుతున్న ఈ సినిమా హిట్ అవ్వటం ఇటు సమంతకు, అటు దర్శకుడు గుణశేఖర్ కు చాలా కీలకం. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా గనక హిట్ అయితే పాన్ ఇండియా హిట్ అందుకున్న తొలి హీరోయిన్ గా అరుదైన ఘనత సాధించిన హీరోయిన్ అవుతుంది. అయితే సమంత మినహా ఈ సినిమాలో అంతటి అట్రాక్షన్ లేకపోవటం బాక్సాఫీస్ వద్ద పరీక్షగా మారనుంది. హీరో దేవ్ మోహన్ తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేకపోవటం కూడా ఈ సినిమాకు అంతగా కలిసొచ్చే అంశంలా కనిపించట్లేదు. ఏదేమైనా సినిమాలోని కంటెంట్ గనక జనాలకు నచ్చితే ఇవేమి పెద్ద అడ్డంకులు అయ్యే ఛాన్స్ లేదు.
నేటి తరానికి పెద్దగా పరిచయం లేని శకుంతల, దుశ్యంతుల ప్రేమగాధ ప్రధానంగా సాగే నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్స్ హై రేంజ్ లో చేయటంతో పాటుగా మౌత్ టాక్ కూడా చాలా కీలకం కానుంది. గతంలో కొన్ని చిన్న సినిమాలు కూడా మంచి మౌత్ టాక్ సొంతం చేసుకొని పాన్ ఇండియా వైడ్ హిట్ సాధించాయి. మరి, మాయోసైటిస్ నుండి కోలుకొని మునుపటి ఉత్సాహంతో కనిపిస్తున్న సమంతకు ఈ సినిమా హిట్ ద్వారా ఉత్సాహం రెట్టింపు అవుతుందా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు