Suhas : ‘అంబాజీపేట కుర్రాడు’ ఆ స్థానాన్ని అందుకుంటాడా?

ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా షార్ట్ ఫిల్మ్ లతో ఫేమస్ అయి, సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ, కలర్ ఫోటో సినిమాతో హీరోగా పాపులర్ అయిన నటుడు “సుహాస్”. టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు ఇతను. వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన క్యారెక్టర్ ను వదులుకోకుండా ఏ పాత్రనైనా చేస్తూ నటుడిగా ముందుకెళ్తున్న సుహాస్ హీరోగా వరుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇక సుహాస్ నటించిన కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యూరో”.

దుశ్యంత్ కతికనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బన్నీ వాసు, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మించాడు. తాజాగా అంబాజీపేట థియేట్రికల్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే టీజర్ తో సుహాస్ గత సినిమాలాగానే సరదా కామెడీ, నాలుగు పాటలు, రెండు ఫైట్లు ఉన్న మాములు సినిమా అని అనిపించినా ట్రైలర్ దిగాకే తెలిసింది. ఈ బ్యాండు మామూలుగా లేదని. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద తీన్మార్ వేస్తుందని ట్రైలర్ ని చూస్తే తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరో విలేజ్ లో బ్యాండు మేళం ఫ్యామిలీకి చెందినవాడు కాగా, బార్బర్ కూడా. ఇక కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని చోట్ల విన్న కథలాగానే ఉన్నా, దర్శకుడు తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తాడని, ముఖ్యంగా ఈ సినిమాలో హీరోహీరోయిన్లు మొదలుకొని అందరికి వాళ్ల పాత్రల పరిధి కి మించి నటనకి స్కోప్ ఉండే రోల్స్ ఇచ్చాడని తెలుస్తుంది.

ఇక సుహాస్ కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ తో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు అంబాజీ పేట మ్యారేజి బ్యాండు తో హీరోగా హ్యాట్రిక్ హిట్ కొడదామని వస్తున్నాడు. అయితే టాలీవుడ్ లో మాస్ జోనర్లోకి హీరోయిజం జోలికి పెద్దగా వెళ్లకుండా జనాలకి నచ్చే అన్ని రకాల సినిమాలు తీస్తున్న హీరోల సరసన సుహాస్ నిలిచాడు. అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీ లో కొంచెం పెద్ద స్థాయిలో, అంటే మీడియం రేంజ్ హీరో స్థాయి కి సుహాస్ రాలేదు. కానీ ఇప్పుడు వస్తున్న అంబాజీ పేట మ్యారేజి బ్యాండు సినిమా ఆ స్థానాన్ని సంపాదించి ఇస్తుంది అని ట్రైలర్ ని చూస్తే అనిపిస్తుంది. మరి మరో వారంలో థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా సుహాస్ కి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ తెచ్చిపెడుతుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు