Srikanth: చిరంజీవి మూవీ కోసం శ్రీకాంత్ ను బెదిరించారా.. తెరపైకి కొత్త నిజం..!

Srikanth: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అందుకున్న మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ రైట్స్ తీసుకోగా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా స్టోరీలో మార్పులు చేర్పులు చేస్తూ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా సెట్ చేశారు. ఇందులో చిరంజీవి పక్కన ఏటీఎం క్యారెక్టర్ ను చేయడానికి ఎవరిని తీసుకోవాలో అర్థం కాక దాదాపు ఒక్క క్యారెక్టర్ కోసం రెండు నెలలుగా రకరకాల వ్యక్తులను అనుకొని వారిని తీసేస్తూ వచ్చారు బృందం. ఈ క్రమంలోనే ఏటీఎం క్యారెక్టర్ కోసం చిరంజీవి కూడా చాలా మందిని చూస్తూ రాగా చివర్లో శ్రీకాంత్ కూడా వాళ్ళందర్నీ అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు..

అయితే ఆ క్యారెక్టర్ తనకైతే బాగుంటుందని శ్రీకాంత్ తనలో తాను అనుకుంటున్నప్పటికీ.. తాను చేస్తానని చిరంజీవితో చెప్తే.. వద్దనడు.. పైగా ఆ పాత్రకు తాను సెట్ అవ్వకపోయినా చిరంజీవి తనను తీసుకుంటారు. అలా తీసుకున్నాక ఒకవేళ తాను ఈ పాత్రకు సెట్ అవ్వకపోతే సినిమాకి తన వల్ల ఏమైనా ఇబ్బంది జరగొచ్చు అని అనుకున్నారట శ్రీకాంత్. అయితే అలాగే ఒకవేళ నేనే ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతాను అనుకుంటే అన్నయ్య నన్ను చేయమని అడుగుతారు కదా.. అలాంటప్పుడు మనం ఎందుకు అన్నయ్యని అడిగి ఇబ్బంది పెట్టడం అంటూ తన కోరికను తన మనసులోనే పెట్టుకున్నారు శ్రీకాంత్.

అయితే ఒకరోజు శ్రీకాంత్.. చిరంజీవి పర్సనల్ గా ఒక పని మీద కలుసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకుంటూ చివరికి చిరంజీవి శ్రీకాంత్ తో ఏటీఎం క్యారెక్టర్ నువ్వే చేసెయ్ అని చెప్పాడట. దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యారట శ్రీకాంత్.. అది చూసి చిరంజీవి.. ఏం నీకు చేయడం ఇష్టం లేదా అని శ్రీకాంత్ ను అడిగితే.. అలా కాదు అన్నయ్య.. మీరు ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తున్నాను.. అంటూ చెప్పి ఆ క్యారెక్టర్ చేయడానికి శ్రీకాంత్ సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ఒక పెద్ద నటుడు శ్రీకాంత్ ను క్యారెక్టర్ నుంచి తప్పుకోమని ఫోన్ చేసి.. ఆ క్యారెక్టర్ లో చేయకూడదు అని బెదిరించారట. ఇదే విషయాన్ని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

- Advertisement -

అయితే అతను ఎవరు అనే విషయాలు బయటకు చెప్పకపోయినా ఆ నటుడు తనని తప్పుకోమని చెప్పిన విషయాన్ని మాత్రం శ్రీకాంత్ వెల్లడించారు. ఇకపోతే తాను ఆ క్యారెక్టర్ నుంచి తప్పుకుంటే.. ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్ చేస్తానని శ్రీకాంత్ తో చెప్పారట. అలాగే ఆయనకి కౌంటర్ ఇస్తూ.. నేను తప్పుకుంటే నీకు క్యారెక్టర్ రావడం ఏంటి? నువ్వు ఆ క్యారెక్టర్ కి సెట్ అయితే వాళ్ళే నిన్ను పిలుస్తారు కదా అని చెప్పి అతని నుంచి తప్పించుకున్నారట శ్రీకాంత్.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు