Koratala Siva: పాపం రెండుసార్లు రాజమౌళి సెంటిమెంట్

Koratala Siva: కొరటాల శివ, రచయితగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమై ప్రత్యేకమైన హిట్స్ అందుకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించాడు. మిర్చి సినిమాతో దర్శకుడుగా మారి కమర్షియల్ డైరెక్టర్గా తనకంటూ ఒక మంచి పేరును సాధించుకున్నాడు. కొరటాల శివ మిర్చి సినిమా వచ్చినంత వరకు కూడా ఎవరికీ అంతగా అంచనాలు లేవు.
కానీ మిర్చి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని సమపాళ్లలో ఉన్నాయి. ప్రభాస్ ని చూపించే విధానం ఇది కదా అంటూ చాలామంది హ్యాపీగా ఫీలయ్యారు.

ప్రభాస్ ను కూడా ఆ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపించాడు కొరటాల శివ. ఆ సినిమా తర్వాత కొరటాల శివ మహేష్ బాబుతో సినిమా చేసి శ్రీమంతుడుతో అద్భుతమైన హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కించి. ఆ సినిమాతో కూడా తిరుగులేని విజయాన్ని అందించుకున్నాడు. ఆ తర్వాత చేసిన భరత్ అనే నేనే సినిమాలో స్టైలిష్ సీఎంగా మహేష్ బాబును చూపించి కోట్లు కొల్లగొట్టాడు. అయితే ఆ తర్వాత చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా అనుకోని విధంగా నిరాశపరిచింది.

అయితే ఆచార్య సినిమా జరుగుతున్న టైం లోనే చిరంజీవి ఒక స్టేట్మెంట్ను పాస్ చేశారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయిన వేరే దర్శకుడు తో సినిమా చేస్తే ఆ సినిమా ఫెయిల్ అవుతుంది అని అంటారు. కానీ ఆ ఫేట్ ని ఇప్పుడు కొరటాల శివ మార్చబోతున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కానీ సినిమా అనుకోని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది.

- Advertisement -

అయితే రాజమౌళి సెంటిమెంట్ ను మరోసారి బ్రేక్ చేయాల్సి వచ్చింది కొరటాల శివ. ఎందుకంటే రాజమౌళి చేసిన ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ మరియు రాంచరణ్ నటించారు. రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. తర్వాత దేవర సినిమాతో రెండోసారి రాజమౌళి సెంటిమెంట్ కు చెక్ పెట్టె అవకాశం కొరటాల శివకు మాత్రమే దక్కింది. రాజమౌళి సెంటిమెంట్ కి చెక్కిపెట్టి కొరటాల శివ ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడా లేదా తెలియాలి అంటే దేవర రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు