Gangs of Godavari: అబ్బా ఐటెం సాంగ్ తో ఇషా రెబ్బ

Gangs of Godavari: సినిమాలలో ఐటెం సాంగ్స్ కి ఉన్న ప్రత్యేకత వేరు. ఒక కమర్షియల్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు హిట్ అయిన చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్ అనేది ఉంటూనే ఉంటుంది. త్రివిక్రమ్ సినిమా మినహాయిస్తే మిగతా దర్శకులు సినిమాలలో ఐటమ్ సాంగ్ అనేది ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుందని చెప్పొచ్చు. అలానే ఇంకా సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్య నుంచి పుష్ప సినిమా వరకు సుకుమార్ సినిమాలలో అద్భుతమైన ఐటమ్స్ సాంగ్స్ ఉన్నాయ్.

అలానే హీరోహీన్స్ ఐటెం సాంగ్స్ చేయడం అనేది కొత్త విషయం కాదు.
ఇప్పటివరకు చాలామంది వచ్చి అలా పాటలో కనిపించారు. ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికి కొలువున్నకాజల్ కూడా పక్క లోకల్ అంటూ జనతా గ్యారేజ్ లో స్టెప్పులు వేసింది.హ్యాపీ డేస్,కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి చిన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న మిల్కి బ్యూటీ తమన్నా కూడా “జై లవ కుశ” సినిమాలో ఐటెం సాంగ్ తో అలరించింది.

వీళ్ళే కాకుండా అప్పటి హీరోయిన్స్ అయిన రాశి,రంభ లాంటి వాళ్ళు కూడా ఐటెం సాంగ్స్ తో అలరించారు. హీరో రాజశేఖర్ కెరియర్ లో ఆ మధ్య వచ్చిన గరుడ వేగ సినిమా హిట్ అవ్వడానికి కూడా కారణం ఆ సినిమాలో “సన్నీ లియోన్” చేసిన ఐటెం సాంగ్ ఏ కారణం.మూమూలుగా సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్స్ అదిరిపోతాయి. అందులో భాగంగా పుష్ప సినిమాలో సమంత సాంగ్ ఇంకా హైలెట్.

- Advertisement -

ఇకపోతే ఇప్పుడు మరో హీరోయిన్ ఐటెం సాంగ్ తో అలరించనుంది. హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఇషారెబ్బ, విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాతో చాలా ఏళ్ళు తరవాత మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు కృష్ణ చైతన్య.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు