Suhas: ట్రైలర్ తోనే హిట్ కొట్టేలా ఉన్నాడే.. మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ..!

Suhas: టాలీవుడ్‌లో మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత హీరోగా పలు సినిమాలలో చేసి పర్వాలేదు అనిపించుకున్న యంగ్ హీరోలలో సుహాస్ కూడా ఒకరు. ఈ హీరో సినిమా అంటే కచ్చితంగా బాగుంటుంది అనే మార్క్ ప్రేక్షకులలో పడిపోయింది. గతంలో కలర్ ఫోటో సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. సుహాస్ పలు సినిమాలలో విలన్ గా కూడా నటించారు. అలా వచ్చిన హిట్ 2 ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.

ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మరొకసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా పూర్తిగా పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిస్తున్నట్లు.. ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో సుహాస్ బ్యాండ్ వాయిస్తూ కనిపిస్తున్నారు. మరొకసారి తన నటనతో ఇరగదీసేసారని కూడా చెప్పవచ్చు. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా అదిరిపోయేలా ఉందని.. లవ్ , కెమిస్ట్రీ పరంగా కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ట్రైలర్ కనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం ఈ సినిమాకి హైప్ అయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో సుహాస్ కామెడీ టైమింగ్ , యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.

సుహాస్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి మరీ నటించాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కూడా సుహాస్ కెరియర్ లో ఒక గ్రాఫ్ గా నిలిచిపోతుందని.. అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా తన కెరీర్ కు ఉపయోగపడుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ అయితే అందరినీ ఆకట్టుకుంటోంది.

- Advertisement -

కాగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి డైరెక్టర్ దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుహాస్ కి జోడిగా శివాని నాగరం నటిస్తోంది. అలాగే ఇందులో పుష్ప ఫేం నటుడు జగదీష్ తో పాటు తదితర నటీనటులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. గీత ఆర్ట్స్ -2 బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు