Family Star: దేవర డేట్ కి దేవరకొండ వస్తాడా.?

Family Star: ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ తో పాటు ప్రపంచ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా దేవర. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, జాన్వి కపూర్ నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా సక్సెస్ కొరటాల శివకి ఇప్పుడు చాలా అవసరం.

మిర్చి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన కొరటాల శివ, మొదటి సినిమాతోనే హిట్ అందుకొని తనకంటూ ఒక ముద్రను వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత చేసిన శ్రీమంతుడు సినిమా అద్భుతమైన హిట్టై 100 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టింది. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన కలెక్షన్స్ను రాబట్టాయి. వరుసగా హిట్ సినిమాల చేయడం వల్ల కొరటాల శివకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే అవకాశం దక్కింది.

అయితే చిరంజీవి హీరోగా చేసిన ఆచార్య సినిమా అనుకోని విధంగా బాక్సాఫీస్ వద్ద బాల్తా కొట్టింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉండటంతో పాటు ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. కానీ ఆ సినిమా అంచనాలను మినిమం అందుకోలేకపోయింది. అక్కడి నుంచి కొరటాల శిఖరం నుంచి పాతాళానికి పడిపోయాడు అనే రేంజ్ లో అందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అందుకే దేవర సినిమాతో తనదైన ముద్రను వేసి మంచి కంబ్యాక్ ఇవ్వాలని కొరటాల శివ కష్టపడుతున్నాడు.

- Advertisement -

ఇకపోతే దేవర సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాయిదా పడిన డేట్ కి దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఫ్యామిలీ స్టార్ సినిమా జనవరిలో రిలీజ్ కావలసి ఉంది. సంక్రాంతి కానుకగా రావాల్సి ఉన్న ఈ సినిమా ఆ టైం కి పూర్తి కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 5కి ఈ సినిమా రిలీజ్ అయితే ఈ సినిమాకి మంచి డేట్ దొరికిందని చెప్పొచ్చు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత పరశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు