Summer movies : వాయిదాల పర్వం ఇక్కడ్నుంచే మొదలయ్యిందా?

టాలీవుడ్ లో సంక్రాంతి, దసరా సీజన్ల తర్వాత అతిపెద్ద సీజన్ సమ్మర్. నిజానికి వాటికంటే కూడా పెద్దది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే స్కూల్ మొదలుకొని పిజి కాలేజీల వరకు రెండు నెలల లాంగ్ హాలిడేస్ ఉంటాయి. అందుకే పెద్ద పెద్ద సినిమాలు కూడా ఏడాదికి ముందే సమ్మర్ రిలీజ్ లపై ఖర్చీఫ్ వేస్తుంటారు. పైగా సమ్మర్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే, లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లు వసూలు చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ 2023 మాత్రం సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక బోసిపోయింది. దసరా, విరూపాక్ష లాంటి మీడియం రేంజ్ సినిమాలు సందడి చేసాయి. అయినా ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల మార్క్ ను అందుకున్నాయి.

కానీ 2024 సమ్మర్‌లో స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని, సీనియర్ హీరోల సినిమాలు కూడా క్యూ కడుతాయని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ “దేవర” సినిమా పోస్టుపోన్ అవుతుంది అంటూ వార్తలు వచ్చాయో.. అప్పట్నుంచి సమ్మర్ కి రానున్న అన్ని సినిమాలపై లేనిపోని డౌట్లు మొదలయ్యాయి. సైఫ్ కి ఆక్సిడెంట్ అవ్వడం వల్లే తమ సినిమా వాయిదా వేయాలనే ఆలోచన మేకర్స్ లో ఉందని తెలుస్తుంది. ఇక మే 9 న రిలీజ్ కావాల్సిన “కల్కి”2898ఎడి సినిమా యొక్క సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదనే ఓ టాక్ ఉంది. పైగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తేడకొట్టిన దాని రిజల్ట్ దారుణంగా ఉంటుంది కాబట్టి, గ్రాఫిక్స్ వర్క్ లేటయితే వాయిదా వేయక తప్పదు.

ఇక సమ్మర్ కి రావాల్సిన పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందని తెలిసిందే. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మొన్నటి వరకు సమ్మర్ లోనే అనుకున్నా, కనీసం మే లాస్ట్ వీక్ లోనైనా రిలీజ్ చేద్దామని ప్లాన్ వేసినా, ఇండియన్ 2 వల్ల అదీ కుదరలేదు. అందుకే సెప్టెంబర్ కి వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ పుష్ప ఆగష్టు కే ఫిక్స్ అయ్యారని తెలిసిందే. ఇక టాప్ హీరోలు కాకుండా, సీనియర్ స్టార్స్ విషయానికి వస్తే, చిరంజీవి మూవీ ఈ ఇయర్ లో వచ్చే ఛాన్స్ లేదు. నాగార్జున, వెంకటేష్ సినిమాలు అసలు మొదలే కాలేదు. అయితే బాలకృష్ణ, బాబీ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నా, ఏపీ ఎలక్షన్లలో బాలయ్య బిజీ అయ్యి అసలు షూటింగే చెయ్యట్లేదు. రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా ఇంకా షూటింగ్ బాకి ఉంది. కాబట్టి జులై టైం లో ఆ సినిమా రావచ్చు.

- Advertisement -

ఇక మీడియం రేంజ్ హీరోల సినిమాలు… సమ్మర్‌లో వస్తాయని చెబుతున్నా… ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మేకర్స్ అనౌన్స్ చేసిన డేట్‌కి వచ్చే ఛాన్స్ లేదు. అయినా ఈ సమ్మర్ స్టార్టింగ్ లోనే టిల్లు 2, డబుల్ ఇస్మార్ట్, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు ఖర్చీఫ్ వేసినా, ఒకదానికి ఒకటి పోటీగా వచ్చే అవకాశం లేదు. మరి ఈ ఇయర్ సమ్మర్ లో ఎన్ని పెద్ద సినిమాలు దిగుతాయో కనీసం ఏప్రిల్ వచ్చేదాకా చెప్పలేం. అయితే డబ్బింగ్ స్టార్ హీరోలైన కమల్ హాసన్ ఇండియన్2 , రజినికాంత్, సూర్య సినిమాలు సమ్మర్ లోనే వచ్చే ఛాన్స్ ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు