Kalki 2898 AD: ఎప్పుడు వస్తారు బాబు.?

Kalki: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మహానటి సినిమా తర్వాత నాగ అశ్విన్ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతుంది. ఇదివరకే రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ కెరియర్ విషయం తీసుకుంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి సినిమా ప్రభాస్ కి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొచ్చింది. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతూ వచ్చింది. ప్రస్తుతం సలార్ తో మంచి హిట్ అందుకున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన కొన్ని చిత్రాలు అభిమానులను ఆకట్టుకోలేదు. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా మాత్రం మంచి రిజల్ట్ ను అందించింది. కమర్షియల్ గా కూడా మంచి ఫలితాన్ని అందుకుంది.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి, కల్కి పై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇదివరకే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇకపోతే మే 9 అని అనౌన్స్ చేసిన ఈ సినిమా మళ్లీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది అన్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాల్లో నాగ్ అశ్విన్ ప్రయోగాలు చేస్తున్నాడు. అలాగే సినిమాల్లో ఉపయోగించే పరికరాలపై కూడా డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాకి ఎక్కువ టైం పడుతుంది.

- Advertisement -

దీనిలో కమలహాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే వంటి పెద్ద స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోని ప్రభాస్ కి ఈ సినిమా మంచి ఫలితాన్ని అందిస్తుందని చాలామందికి ఒక నమ్మకం. దానికి తోడు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో స్టార్ హీరో సినిమా వచ్చి చాలా ఏళ్లు దాటింది. అందుకోసమే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ చాలామంది ఎదురుచూస్తున్నారు. మామూలుగా సంక్రాంతికి అనౌన్స్ చేసిన ఈ సినిమా వాయిదా పడుతూ, వాయిదా పడుతూ సమ్మర్ బరిలో పడింది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ సిద్ధంగా లేదని వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు