Vijay: ఆ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడా?

రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం “గేమ్ చేంజర్” లో మాత్రమే నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే పలు యాడ్ షూట్లలో మాత్రం రెగ్యులర్ గా కనిపిస్తూ ఉన్నాడు. రీసెంట్ గా మీషో యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ ఈ మధ్యనే తండ్రి అయిందనువల్ల కొన్ని రోజులు ఫ్యామిలీ తోనే ఉండనున్నారు. అటు శంకర్ కూడా గేమ్ చేంజర్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇండియన్2 ఫినిష్ చేస్తున్నాడు.

ఇటు రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి బాబు తో సినిమా చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా చేస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దానికి లోకేష్ కూడా పలు మీడియా ఇంటర్వ్యూల్లో స్పందిస్తూ, రామ్ చరణ్ తో మూవీ చేయాలనీ ఉంది. పలు స్క్రిప్తుల గురించి కూడా చర్చ జరిపాను అన్నాడు. అయితే ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెడతానని అన్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ లోకేష్ కానగరాజ్ సినిమాపై ఒక తాజా వార్త తెగ వైరల్ అవుతుంది. లోకేష్ కానగరాజ్ ప్రస్తుతం దళపతి విజయ్ తో “లియో” అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా లో రామ్ చరణ్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడని, ఆ పాత్ర సినిమాని మలుపు తిప్పుతుందని నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ పాత్ర లోకి యూనివర్స్ లో భాగమేనని పలువురు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీనికి తోడు లియో సినిమా పై అప్డేట్స్ ఇచ్చే ఒక అఫిషియల్ ట్విట్టర్ పేజీ ఈ రూమర్ నిజం కావచ్చని హింట్ ఇచ్చింది. కానీ దీనిపై ఎంత నిజముందో క్లారిటీ రావాలంటే చిత్ర దర్శకుడు లోకేష్ కానగరాజ్ చెప్పాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు