Sree Vsihnu: సామజవరగమన వసూళ్ల కుమ్ముడు.. డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా పయనం

శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా సామజవరగమన బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. చాలా రోజుల తరువాత ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటెర్టైన్మెంట్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు. మొదటిరోజు అంతగా ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయిన ఈ సినిమా రెండో రోజు నుండి మాత్రం మౌత్ టాక్ తో హౌస్ ఫుల్ అవుతూ వచ్చింది. ఇతర సినిమాల నుండి పోటీని తట్టుకుని సైతం ఈ సినిమాకి వసూళ్లు వస్తున్నాయి.

ఇక సామజవరాగమన ఐదవ రోజు వర్కింగ్ డే అయినా కూడా ఈవెనింగ్ షో లతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో కుమ్మేసింది. 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 56 లక్షలు రాబట్టగా, వరల్డ్ వైడ్ పైగా 91 లక్షల కి పైగా షేర్ రాబట్టింది. ఇక ఈ సినిమా 5 రోజుల్లో మొత్తంగా 6.32కోట్ల షేర్ ని 11.95 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక అయిన బిజినెస్ కి 2.82 కోట్లకి పైగా లాభాన్ని అందుకున్న ఈ సినిమా డబల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా 10 నుండి 12 కోట్ల వరకు షేర్ సాధించే అవకాశం ఉంది.

వచ్చే వారం కూడా పెద్దగా అంచనాలున్న సినిమాలేవి లేకపోవడంతో ఈ సినిమా ఇంకా పుంజుకునే అవకాశం ఉంది. సామజవరాగమన ఓవర్సీస్ లో ఇప్పటికే హాఫ్ మిల్లియన్ డాలర్లకి దాటేసి వన్ మిల్లియన్ మార్క్ దిశగా దూసుకుపోతుంది. ఇటు శ్రీ విష్ణు కి చాలా రోజుల తరువాత ఒక భారీ హిట్ వచ్చిందని చెప్పవచ్చు. అంతే కాక వరుస ప్లాపుల నష్టాలతో సతమతమవుతున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలకి సామజవరగమన చిత్రం కొంచెం ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు