AA22 : త్రివిక్రమ్ ఆ హీరోతో చేద్దామనుకున్న కథను బన్నీతో చేస్తున్నాడా ?

ఇటీవలనే అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి నాలుగోసారి సినిమా చేయబోతున్నారని ఎనౌన్స్ మెంట్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమా కథను త్రివిక్రమ్ నిజానికి బన్నీ కోసం రాసుకోలేదట, ఒక పాన్ ఇండియన్ హీరో కోసం రాసుకొని, అతనితో సినిమా ప్లాన్ చేయాలనీ గట్టిగ ట్రై చేసాడట.

ఆ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉండటం మూలాన బన్నీతో చేయవలసి వస్తుందని ఫిలిం నగర్ టాక్. మరి త్రివిక్రమ్ ఈ కథను ఏ హీరో కోసం రాసుకున్నాడో తెలుసా.. ఆ హీరో మరెవరో కాదు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్

అవును! ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డైరెక్టరులంతా పాన్ ఇండియన్ సినిమాలు తీస్తూ, పాపులారిటీని పెంచుకుంటుంటే, సీనియర్ డైరెక్టర్ గా, మాటల మాంత్రికుడిగా ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్న త్రివిక్రమ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయకపోవడంతో ఆయన అభిమానులు కాస్త అసంతృప్తితో ఉన్నారనేది వాస్తవం. దాంతో ఆలోచనలో పడ్డ త్రివిక్రమ్, గత కొద్దీ రోజులుగా ఒక ఐడియా మీద వర్క్ చేస్తూ ఫైనల్ గా ఇటీవలనే స్క్రిప్ట్ కూడా కంప్లిట్ చేసాడంట. ప్రభాస్ ను మైండ్ లో పెట్టుకొని కథ చేసుకున్న త్రివిక్రమ్ ఆయన కలిసి కథ వినిపించడానికి ప్రయత్నించిన, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల దృష్ట్యా ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా చేసే పరిస్థితి లేకపోవడంతో త్రివిక్రమ్ అదే కథను అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజీ తగ్గట్టుగా మార్పులు చేసి బన్నీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

- Advertisement -

అయితే సోషల్ మీడియాలో వస్తున్న పుకారు ప్రకారం ఈ సినిమా సోషియో ఫాంటసి సబ్జెక్ట్ కాదంట, నిజానికి ఈ సినిమా మహాభారతంలోని ఎవరికీ తెలియని కొన్ని విషయాలను బేస్ చేసుకొని త్రివిక్రమ్ ఈ కథను తయారు చేసాడంట. అయితే మొదటిసారి ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తుండటంతో యూనివర్సల్ కనెక్ట్ ఉన్న పాయింట్ తో ఈ సినిమా ఉండబోతున్నట్టు టాక్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు