Matka Movie : ఈ ఫ్లాప్ మ్యూజిక్ డైరెక్టర్ వెనకాలే ఎందుకు?

ట్యాలెంట్ అనే మాట విన్పించినా చాలు చిత్ర పరిశ్రమలో అవకాశాలు క్యూ కట్టడానికి. ట్యాలెంట్ తో పటు లక్ ఉన్నవారెవరికైనా టాలీవుడ్ తలుపులు బార్లా తెరిచి ఆహ్వానిస్తుంది. అయితే ఓ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం అంతా రివర్స్ లో జరుగుతోంది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ను మాత్రం వదలడం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీ. అసలా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “పలాస” ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం “మట్కా” రెగ్యులర్ షూట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో టీమ్ బిజీగా ఉంది 1958-1982 మధ్య యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇలాంటి భారీ మూవికీ సౌత్‌లో అత్యంత బిజీ గా ఉన్న కంపోజర్‌లలో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. అయితే ఇప్పటిదాకా ప్రకాష్ మ్యూజిక్ అందించిన టాలీవుడ్ సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి.

రీసెంట్ డిజాస్టర్ మూవీ “ఆదికేశవ” మొదలుకొని, ఆయన సంగీతం అందించిన “టైగర్ నాగేశ్వరరావు”, “జపాన్” సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఆయన మ్యూజిక్ సినిమాను నడిపించే విషయంలో ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే ఇదంతా చూశాక కూడా టాలీవుడ్ లో ఆయనకు వరుస ఆఫర్లు వస్తూ ఉండడం గమనార్హం. ఆయన తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాడనే కారణమో మరొకటో తెలియదు గానీ ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ను మాత్రం వదలడానికి ఇష్టపడట్లేదు టాలీవుడ్. దేవి శ్రీ ప్రసాద్, తమన్ వంటి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్లు బిజీగా ఉన్న ఈ టైం ప్రకాష్ కు నిజంగా మంచి టైం అని చెప్పాలి. ఒకవేళ ఈ సినిమాతోనన్నా ఆయన హిట్ అందుకుంటే నెక్స్ట్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకోవచ్చు. లేదంటే గనక ప్రకాష్ కుమార్ కు టాలీవుడ్ మేకర్స్ ముఖం చాటేసే ఛాన్స్ లేకపోలేదు. మరి ఈ మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడా లేదా ? మరేం జరుగుతుందో వేచి చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు