Mansoor Ali Khan : హీరోయిన్లకు, చిరుకు లింక్ పెడుతూ కామెంట్స్… ఆ పార్టీలు అందుకేనా ?

సీనియర్ తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇంతకు ముందు టాలీవుడ్ ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. కానీ ఇటీవల ఆయన త్రిషపై చేసిన అసభ్యకర కామెంట్స్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అది నెగెటివిటినే అనుకోండి… ఏదైతేనేం మొత్తానికి ఇతనెవరో చాలామంది తెలుగు ఆడియన్స్ ను తెలిసింది. ఇదిలా ఉండగా తాజాగా ఈయన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి, హీరోయిన్లకు లింక్ పెడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకుల్లో చిరు గురించి కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి

రీసెంట్ గా మన్సూర్ ‘లియో’ సినిమాలో విలన్ గా తాను ‘లియో సినిమాలో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డా అంటూ చేసిన కామెంట్స్ ఎంతటి దుమారాన్ని సృష్టించాయో తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై హీరోయిన్ మాళవిక మోహనన్, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లతో పాటు చిరంజీవి కూడా ఫైర్ అయ్యారు. అప్పటిదాకా త్రిషకు సారీ చెప్పను అని మొండికేసిన మన్సూర్, జాతీయ మహిళా కమిషన్, దక్షిణ భారత నటీనటుల సంఘం నుంచి నోటీసులు అందడంతో త్రిషకు బహిరంగంగా సారీ చెప్పేశాడు. దీంతో ఈ వివాదం ముగిసిందని అంతా భావించారు. కానీ ఆ తరువాతే కొత్త కథ షురూ చేశాడు మన్సూర్.

తాజాగా మన్సూర్ మాటాడుతూ చిరంజీవి ప్రతీ సంవత్సరం లేడీ హీరోయిన్లను పార్టీకి పిలుస్తూ ఉంటాడు. ఆ పార్టీకి నన్నెప్పుడూ పిలవలేదు అనుకోండి. ఆయన హీరోయిన్స్ ను మాత్రమే పార్టీలకు పిలుస్తారు. అది ఆయన ఇష్టం… కానీ నాకు సంబంధించిన వివాదం తెరపైకి వచ్చినప్పుడు అసలేం జరిగింది? అని ఫోన్ చేసి ఓసారి విషయం ఏంటో తెలుసుకుని ఉంటే బాగుండేది. అలా చేయకుండా మా గురించి ఆయన మాట్లాడిన మాటలు నన్ను బాధ పెట్టాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరంజీవి పార్టీ పేరుతో కొన్ని వేళా కోట్లు సంపాదించారని, ఒక్క పేదవాడికి కూడా హెల్ప్ చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ఖుష్బూ, త్రిష, చిరంజీవిలపై 20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. అంతేకాకుండా ఆ డబ్బుతో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు దానం చేస్తానంటూ ఆయన కామెంట్స్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

దీంతో నిజంగానే చిరంజీవి హీరోయిన్లను మాత్రమే పార్టీకి పిలుస్తారు అంటూ గతంలో వారితో కలిసి దిగిన ఫోటోలను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. చిరంజీవి తనతో సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్లకు ఏడాదికి ఒకసారి పార్టీలు ఇస్తున్న విషయం తెల్సిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు