Biggboss season 7: ‘ఫినాలే అస్త్ర’ కోసం స్క్ట్రిక్ట్ గా గేమ్ ఆడిన కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 7 మరో 20 రోజుల్లో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. ఆ విషయం గుర్తుపెట్టుకున్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎవరికీ వారు నామినేషన్స్ లో తమ జోరు చూపించారు. తమకి నచ్చని వాళ్ళని నామినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ సరైన రీసన్ లేకపోయినా ఈ వారం పట్టుబట్టి మరి చిన్న చిన్న కారణాలకు నామినేషన్ వేసుకున్నారు.

అయితే నామినేషన్ ప్రాసెస్ అయిపోయాక బిగ్ బాస్ లో ఓ పెద్ద టాస్క్ మొదలైంది. అది కెప్టెన్సీ టాస్క్ కాదు, ఎవిక్షన్ పాస్ టాస్క్ కూడా కాదు. బిగ్ బాస్ చెప్పిన ప్రకారం అది ఈ సీజన్ చివరి టాస్క్, అలాగే ఎంతో ఇంపార్టెంట్ అయిన టాస్క్, అదే “ఫినాలే అస్త్ర”. ఈ అస్త్రాన్ని గెలుచుకోవడానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు. ఓ రౌండ్ టేబుల్ మధ్యలో నిల్చున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళ కాళ్ళ కింద నుండి తిరిగే ఒక చట్రానికి తగలకుండా తప్పించుకోవాలి.

ఈ టాస్క్ లో ప్రశాంత్ మొదలుకొని ఒక్కొక్కరుగా అవుట్ అయ్యారు. చివర్లో అర్జున్ ప్రియాంక నిలిచారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో వీళ్ళిద్దరూ ఫైనల్ వరకూ రాగా, ఈ ఇద్దరిలో ఒకరు కింద పడ్డారని ప్రోమో లో తెలిసింది. అయితే అది ఎవరన్నది సస్పెన్స్ గా ఎండ్ చేసారు. ఈ రాత్రి ఎపిసోడ్ లోనే ఆ కంటెస్టెంట్ ఎవరూ అన్న విషయం క్లారిటీ వస్తుంది. అయితే ఓవరాల్ గా అర్జున్ ప్రియాంక ఇద్దరిలో ఒక్కరే ఆ ఫినాలే అస్త్ర ని గెలిచే ఛాన్స్ ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు