Animal Movie: ఇదేం వేరియేషన్స్ రా అయ్యా… సందీప్ ప్లాన్ ఏంటో…

సినీ ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తున్న మూవీ యానిమల్. డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాపై ఇప్పటి వరకు ఉన్న బజ్ ను చూస్తే.. ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా టైం గురించి మాత్రం ఇంట్రెస్ట్ అయితే మామూలుగా లేదని చెప్పొచ్చు. సాధారణంగా ఒక సినిమాను 3 గంటలు చూడటానికే ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేరు.

అలాంటిది యానిమల్ ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏకంగా 3 గంటల 21 నిమిషాల పాటు చూపించబోతున్నాడు. ఇక ఓటీటీ వర్షెన్ అయితే 3 గంటల 50 నిమిషాలు ఉండబోతుందట. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న యానిమల్ మూవీని ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని టాక్. నెట్‌ఫ్లిక్స్ తో పాటు జీ5, ఆహా యానిమల్ ఓటీటీ రైట్స్ కోసం ట్రై చేశాయట. కానీ, ఫైనల్ గా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం.

ఇదిలా ఉంటే… యూఎస్‌లో యానిమల్ ప్రీమియర్స్ నవంబర్ 30 నుంచే ఉండబోతున్నాయి. ఈ యూఎస్ ప్రీమియర్స్ లో యానిమల్ మూవీ రన్ టైం 3 గంటల 12 నిమిషాలు ఉండబోతుందని తెలుస్తుంది.

- Advertisement -

అంటే యానిమల్ మూవీ రన్ టైంలో మూడు వేరియేషన్స్ ఉన్నాయి.
తెలుగు, బాలీవుడ్ తో పాటు ఇండియాలో యానిమల్ మూవీ రన్ టైం 3 గంటల 21 నిమిషాలు..
యూస్ ప్రీమియర్స్ లో 3 గంటల 12 నిమిషాలు
ఓటీటీ వర్షెన్ లో 3 గంటల 50 నిమిషాలు

ఒక్క సినిమా రన్ టైంలో మూడు వేరియేషన్స్ ఉంటున్నాయా? అసలు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏం ప్లాన్ చేస్తున్నాడు? అసలు ఏం చూపించాలని అనుకుంటున్నాడు ? అంటూ నెటిజన్లు ఆలోచిస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు