Biggboss season7: ఫినాలే పవర్ అస్త్ర లో రెండో ఛాలెంజ్!

బిగ్ బాస్ సీజన్ 7 లో జరుగుతున్న లాస్ట్ టాస్క్ “పవర్ అస్త్ర ఫినాలే“. ఈ టాస్క్ లో ముందుగా ఓ రౌండ్ వన్ ఛాలెంజ్ ని పెట్టగా, ఆ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారో సస్పెన్స్ లో ఉంచారు. అది ఉండగా ఈ ఫినాలే అస్త్ర కోసం కంటెస్టెంట్ రెండో ఛాలెంజ్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ ఒక రూమ్ లో ఉన్న పూలను ఎక్కువ మొత్తంలో సేకరించాల్సింది గా బిగ్ బాస్ చెప్పడం జరిగింది.

అయితే ఈ టాస్క్ లో ఎక్కువ మంది తమ టి షర్ట్ ని ఉపయోగించి అందులో వేసుకుని ఆడడం స్టార్ట్ చేసారు. ఈ విషయాన్నీ శివాజీ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. కానీ బిగ్ బాస్ స్పందించినట్టు అనిపించలేదు. అయితే ఈ టాస్క్ లో తక్కువ పూలు తెచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్ వేరే కంటెస్టెంట్ కి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది.

అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో తక్కువ పూలు సేకరించిన కంటెస్టెంట్స్ శివాజీ, శోభా నిలిచారు. అయితే ఇద్దరూ కలిసి ఒక కంటెస్టెంట్ కి మాత్రమే పూలు ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. దాన్ని బట్టి శివాజీ అమర్ కి ఇచ్చే ఆలోచనలో ఉంటే, శోభా ప్రియాంక కి ఇచ్చే ప్లాన్ లో ఉంది. మరి బిగ్ బాస్ చెప్పినట్టు ఒకరికే ఇవ్వాల్సి ఈ ఇద్దరిలో తగ్గేదెవరో? పైగా ఈ టాస్క్ లో ఇంకెన్ని ఛాలెంజ్ లు ఎదుర్కోవాలో? ఓవరాల్ గా ఎక్కువ టాస్క్ లు గెలిచిన కంటెస్టెంట్ ఫినాలే అస్త్ర ని గెలిచే ఛాన్స్ ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు